అప్పుల మీద అప్పులు చేస్తున్న నవ్యాంధ్ర ప్రభుత్వం | AP Government taking debt again from Central

Ap government taking debt again from central

AP Government taking debt again from Central, Chandrababu Naidu debt from Central, 7 thousand crores from Central to AP, AP govt again debt, AP govt debt after Division, Navayandhra debts

AP Government taking debt again from Central.

అప్పుల సుడిగుం(గం)డం నుంచి గట్టెక్కేదేలాగా?

Posted: 08/20/2016 09:16 AM IST
Ap government taking debt again from central

రాజధాని నిర్మాణం, ఆర్థిక లోటు. ఖర్చులు. ఆదాయం అంతంత మాత్రమే... వెరసి అప్పులు తీసుకోక తప్పని పరిస్థితి. నవ్యాంధ్రప్రదేశ్ క్రమంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటోంది. 2016-17 ఆర్థిక సంవత్సరం ఇంకా సగం కూడా గడవలేదు... ఏపీ మాత్రం ఏకంగా ఆరో సారి రుణం కోసం దరఖాస్తు చేసుకుంది.

గడచిన నాలుగు నెలల్లోనే ఐదు సార్లు అప్పులు తీసుకున్న ఏపీ... తాజాగా ఆరో రుణం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కి నిన్న దరఖాస్తు చేసుకుంది. తాజా దరఖాస్తులో రూ.400 కోట్ల రుణానికి అనుమతించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆర్బీఐకి విన్నవించింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో భారీ ఆర్థిక లోటు నేపథ్యంలో ఏపీ అప్పుల బాట పట్టక తప్పలేదు. ఆర్థిక లోటు భర్తీకి సహకరిస్తామని చెప్పిన కేంద్రం నాన్చుడు ధోరణి అవలంభిస్తున్న నేపథ్యంలో ఏపీకి అప్పులే దిక్కుగా మారాయి. ఇప్పటికే ఐదు సార్లు అప్పు తీసుకున్న ఏపీ, మొత్తం రూ. 6,050 కోట్లు అప్పు తీసుకుంది. తొలి మూడు విడతల్లో ఒక్కో విడతలో రూ.1,500 కోట్ల చొప్పున రూ.4,500 కోట్లు... నాలుగో విడతలో రూ.800 కోట్లు, ఐదో విడతలో రూ.750 కోట్లు సమీకరించింది. తాజాగా మరో రూ.400 కోట్ల రుణానికి అనుమతించాలని ఏపీ సర్కారు చేసుకున్న దరఖాస్తుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే... ఏపీ అప్పు రూ.6,450 కోట్లకు చేరనుంది.

పాత అప్పులు తీరకముందే:
రాష్ట్రం విడిపోక ముందు పదేళ్లలో లక్ష్ కోట్ల పైగానే రుణాన్ని మార్కెట్ బారోయింగ్స్ ద్వారా పొందింది ఉమ్మడి రాష్ట్రం. నవ్యాంధ్ర వాటా 73వేల 856 కోట్లు. తెలంగాణ వాటా 52వేల 783కోట్ల రూపాయలుగా ఉంది.. రాష్ట్ర విడిపోయాక మొదటి ఐదు నెలల్లో 7వేల కోట్లు రుణం పొందింది ఏపీ ప్రభుత్వం. తాజాగ ఈ యేడాది మరో 7వేల కోట్లు కలుపుకుని మొత్తం అప్పు 89వేల కోట్లకు చేరింది. ప్రస్తుతం ఆర్బీఐ లెక్కలప్రకారం ప్రతి వెయ్యి కోట్ల అప్పుకు పదేళ్లలో 800కోట్లు వడ్డీగా కట్టాలి ఈ లెక్కల ప్రకారం ఏపీ తీసుకున్న 89వేల కోట్లకు పదేళ్లలో 71వేల కోట్లు వడ్డీ అవుతుంది... అసలు వడ్డీ కలిపి మొత్తం 160వేల కోట్లకు చేరనుంది..

సాధారణంగా తీసుకున్న అప్పులో కొంత భాగాన్ని నిర్ణీత సమయంలోగా చెల్లించాలి.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏటా 15వేల 500కోట్ల రుణం మాత్రమే పొందే అవకాశం ఉంటుంది.. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం దరిదాపు 7వేల కోట్ల రుణం తీసుకుంది. అప్పుల చిట్టా భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ అప్పులను సకాలంలో ప్రభుత్వం తీరస్తుందా? మధ్యలోనే చతికిలబడుతుందా? అన్నది వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Chandrababu Naidu  debts  central  again  

Other Articles