ఫ్రాన్స్ బీచ్ లలో బురఖాలకు అనుమతి నిరాకరణ | Cannes bans full-body burkini swimsuits from beaches

Cannes bans full body burkini swimsuits from beaches

full-body burkini swimsuits, Burkas bans in beach, Cannes bans full-body burkini swimsuits, Cannes Mayor David Lisnard bans

Cannes Mayor David Lisnard bans full-body burkini swimsuits from beaches.

బురఖా దెబ్బకు బికినీలను దించేశాడు

Posted: 08/13/2016 10:56 AM IST
Cannes bans full body burkini swimsuits from beaches

ప్రపంచమంతా ఉగ్రవాదుల దాడులతో వణికిపోతుంటే, రక్షణ చర్యల పేరుతో కొన్ని దేశాలు చేస్తున్న హడావుడిపై విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యంగా ఓ మతానికి చెందిన వ్యక్తులనే టార్గెట్ చేస్తూ జరుగుతున్న ఈ తతంగాన్ని ప్రపంచదేశాలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. అయితే ఈ మధ్య తరచూ ఉగ్రపంజాకు గురవుతున్న ఫ్రాన్స్ లో ఇది శౄతి మించిపోతుంది.    

కేన్స్ మేయర్ డేవిడ్ లిస్ నార్డ్ మాత్రం నగరంలో అసలు బురఖాలు కనిపించొద్దంటూ ఆంక్షలు విధిస్తున్నాడు. ముఖ్యంగా బీచ్ లకు వచ్చే వారంతా బికినీలతోనే రావాలంటూ ఆదేశించాడు. నిండైన వస్త్రాలతో బీచ్ లకు రావడం నిషేధం, ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ మొత్తంలో జరిమానా(42 అమెరికన్ డాలర్లు) విధిస్తామని హెచ్చరించాడు. అయితే అక్కడి బీచ్ లకు వచ్చే విదేశీ పర్యాటకులలో ముస్లిం మహిళలు ఉంటుంటారు. వారు పూర్తిగా బురఖా లాగా ఉండే బికినీలో వస్తుండటంతో ఐసిస్ కు వరంగా మారిందని, అందుకే ఈ నిబంధనను తీసుకోచ్చాడనే వాదన వినిపిస్తోంది.

ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఒక ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉగ్రవాది ట్రక్కుతో వచ్చి ఫ్రాన్స్ లో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మేయర్ ఐఎస్ఐఎస్ మూకలకు స్వేచ్చగా తిరిగే ఛాన్స్ ఇవ్వకుండా ఇలా పరోక్షంగా మతంపై కొన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఆఫీసులకు వచ్చే మహిళలు స్కర్టులు, కాలేజీకి వెళ్లే అమ్మాయిలు జీన్లు తప్పనిసరిగా వేసుకుని రావాలని ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : burkini swimsuits  ban  French beaches  

Other Articles