పాక్ లిటిల్ మాస్టర్ హనిఫ్ బతికే ఉన్నాడు | Doctors declared Hanif Mohammad dead accidentally

Doctors declared hanif mohammad dead accidentally

Hanif Mohammad alive, heartbeat for six minutes, hanif survive, Pak little master, Pak player alive

Hanif Mohammad returned back to life after losing heartbeat for six minutes as he battles for life at a hospital in Karachi.

ఆ దిగ్గజం గుండె ఆగింది... అయినా, బతికాడు

Posted: 08/11/2016 04:55 PM IST
Doctors declared hanif mohammad dead accidentally

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాక్ లిటిల్ మాస్టర్‌ హనిఫ్ మహ్మద్(81) గుండెపోటుతో మృతి చెందారని కాసేపటి క్రితం మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చనిపోలేదని, ఆరు నిమిషాలు గుండె కోట్టుకోవడం ఆగిపోయి, తిరిగి బతికారని ఆయన కుమారుడు షోయబ్ మహ్మద్ ప్రకటించాడు.

అనారోగ్యంతో కరాచీలోని అగాఖాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హనిష్ చనిపోయాడంటూ వైద్యులు చెప్పటంతో ఆయన కుమారుడు, టెస్ట్ ప్లేయర్ షోయబ్ మహ్మద్ మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయటం విశేషం. అయితే వైద్యులు పొరపాటుతో తాను మీడియా ముందుకు వ‌చ్చి చెప్పాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. 81 సంవత్సరాల హనీఫ్ గత కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్ తో బాధపడుతున్నారు.

కాగా, రెండు చేతులతోనూ బౌలింగ్ చేయగల హనిఫ్ మహ్మద్ తన కెరీర్‌లో మొత్తం 12 సెంచరీలు సాధించి క్రికెట్ అభిమానుల ఆద‌రాభిమానాలు సొంతం చేసుకున్నారు. 1958-59లో వెస్టిండీస్‌తో ఆడిన టెస్ట్ మ్యాచ్‌లో ఆయ‌న అత్యుత్తమ బ్యాటింగ్‌ను క‌న‌బ‌ర్చాడు. మ్యాచులో లాంగెస్ట్ ఇన్నింగ్స్ ఆడి 337 పరుగులు చేశారు. ఈ ఘ‌న‌త సాధించిన ఏకైన‌ పాక్ క్రికెటర్ ఆయ‌నే. త‌న కెరీర్‌లో 43.98 యావరేజ్‌తో మొత్తం 3,915 పరుగులు చేసిన ఆయ‌న‌ ఫస్ట్‌క్లాస్ అత్యుత్తమ స్కోరు 499 పరుగులు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan little master  Hanif  Alive  

Other Articles