నయీంతో సంబంధాలపై ఉమామాధవరెడ్డి స్పందన | Uma Madhava Reddy fire on links up with gangster Naeem

Uma madhava reddy respond on naeem link rumours

EX MP Uma Madhava Reddy, Uma Madhava Reddy Naeem, Uma Madhava Reddy is A1 Accused in Gangster Naeem Case, Elimineti Uma Madhava Reddy Naeem, Elimineti Madavareddy Murder

Rumors on Uma Madhava Reddy is A1 Accused in Gangster Naeem Case

ITEMVIDEOS: నయీంకు నాకు సంబంధం లేదు: ఉమామాధవరెడ్డి

Posted: 08/11/2016 01:27 PM IST
Uma madhava reddy respond on naeem link rumours

నయీం తో ఓ మాజీ మంత్రికి సంబంధాలున్నట్లు వచ్చిన వార్తలపై మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండకు చెందిన ఓ మాజీ మంత్రితో, నయీంకు సంబంధాలు ఉన్నట్లు పోలీస్ విచారణలో తేలిందని, ఏ1 నిందితులుగా ఆ పేరును చేర్చబోతున్నారని ఈరోజు ఉదయం నుంచి నేషనల్, స్థానిక మీడియాల్లో వార్తలు రావటం తెలిసిందే. అయితే అది టీడీపీ దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి కుటుంబంతోనేనని కొందరు కన్ఫర్మ్ చేసేయటంతో ఆమె మీడియా ముందుకు వచ్చారు.

తన భర్త మాధవరెడ్డికి ఉన్న మంచి పేరును చెడగొట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆమె ఆరోపించారు. నయీం తో సంబంధాలున్న తమ వారిని రక్షించుకునేందుకే తమను టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నయీం ఫోన్ నుంచి తనకు వందలాది కాల్స్ వచ్చాయన్న కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె... తన భర్త బతికి ఉన్నప్పటి నుంచి తమ నెంబరే మారలేదని చెప్పారు. తమను, తమ సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టేందుకు కొందరు లీకులిచ్చి మరీ వార్తలు రాయిస్తున్నారని ఆమె చెప్పారు. తన కాల్ లిస్ట్ ను బయటపెడితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని ఆమె అన్నారు. తమది సౌమ్యమైన కుటుంబమని చెప్పిన ఉమా మాధవరెడ్డి... తమ కుటుంబంపై జరుగుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు గుర్తించాలని కోరారు.

నయీంతోనే కాదు, అతని అనుచరులతోనూ సంబంధాలున్నాయన్న వార్తపై ఆమె స్సందించారు. భువనగిరి ప్రజలతో సత్సంబంధాలున్న తనను నిత్యమూ ఎంతో మంది వచ్చి కలసి వెళుతుంటారని, వారిలో నయీం అనుచరులు కూడా ఉండి ఉండవచ్చేమోనని ఆమె వ్యాఖ్యానించారు. వచ్చిన వారి సమస్య ఏమిటన్నదే తెలుసుకుంటాను తప్ప, వారు నయీం మనుషులా? లేక ఎవరి అనుచరులన్న విషయాన్ని తానెన్నడూ పట్టించుకోలేదని తెలిపారు. ఈ వ్యవహారంపై సిట్ తో దర్యాప్తు చేయడం సరికాదని, జ్యూడీషియల్ విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. జ్యూడీషియల్ ఎంక్వైరీతోనే వాస్తవాలు బయటకు వస్తాయని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు.  స్థానిక మీడియాలో పరోక్షంగా కథనాలు వస్తే... నేషనల్ మీడియాలో తన పేరు పెట్టి మరీ కథనాలు రాసిన కారణంగానే తానీ వివరణ ఇస్తున్నానని ఆమె చెప్పారు.

కాగా, ఏమీ సంబంధం లేనప్పుడు మీడియాను ఎందుకు పిలిచారని ఓ విలేకరి ప్రశ్నించగా, "తెలుగు మీడియాలో నల్గొండకు చెందిన మాజీ మంత్రి, మావోల వల్ల కుటుంబ సభ్యుడ్ని కోల్పోయిన వారు అని ప్రత్యేకంగా ప్రస్తావించడం వల్లే తానీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని ఆమె వివరణ ఇచ్చారు. భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం తదితర ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె కొట్టిపారేశారు.

పెద్దకుట్ర చేస్తున్నారు: తనయుడు సందీప్ రెడ్డి

ఇక ఆరోపణలపై తనయుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి కూడా కాస్త ఘాటుగానే స్పందించాడు. మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాల‌ని కుట్ర ప‌న్నే కొంద‌రు పావులు కదుపుతున్నారని, అనవసరంగా తమను ఇందులో ఇరికించాలని ప్రయ‌త్నిస్తున్నారంటూ సందీప్‌రెడ్డి వ్యాఖ్యానించాడు. దీనిపై సీబీఐ లేదా జుడీషియ‌ల్ విచార‌ణ జ‌రిపించి అన్ని నిజాల‌ను బ‌య‌ట‌పెట్టాలని ఆయ‌న డిమాండ్ చేశారు. అంద‌రి విష‌యాలు బ‌య‌ట ప‌డాలంటే విచార‌ణ జ‌రిపించాల్సిందేన‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. రాజ‌కీయ‌ప‌రంగా తమ‌ను దెబ్బతీసేందుకే ఇటువంటి చ‌ర్యలకు దిగుతున్నార‌ని, దీని వెనక టీడీపీ నేతల కుట్ర కూడా ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uma Madhava Reddy  Naeem  links  rumours  press meet  

Other Articles