గ్యాంగ్ స్టర్ నయీం డైరీలో ఏముంది | politicians and Police officials names in naeem dairy

Politicians and police officials names in naeem dairy

Naeem Encounter, gangster naeem, naeem dairy, naeem death, naeem assets, naeem illegal activities, naeem house, naeem disease

Top politicians and Police officials names in naeem dairy.

నయీం డైరీలో కీలక పేర్లు... బెడ్ రూంలో ఏముంది?

Posted: 08/10/2016 10:36 AM IST
Politicians and police officials names in naeem dairy

పక్కా స్కెచ్ తో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ కి గురైన గ్యాంగ్ స్టర్ నయీం కు చెందిన ఓ డైరీ పోలీసుల చేతికి చిక్కింది. ఈ డైరీలో ఉన్న సమాచారం తీవ్ర కలకలం రేపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షాద్ నగర్ కాల్పుల్లో నయీం చనిపోగానే, రాత్రికి రాత్రే అల్కాపురిలోని అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు అక్కడ లెక్కకు మిక్కిలి నోట్ల కట్టలు, మారణాయుధాలతో పాటు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఇదే కీలకంగా భావించిన పోలీసులకు దాని తెరిచి చూడగా షాకిచ్చే విషయాలు అందులో ఉన్నట్లు తెలుస్తోంది.

తనకు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరి పేర్లను ఈ కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ అందులో పేర్కొన్నాడు. ఇందులో 15 మంది దాకా సీనియర్ ఐపీఎస్ అధికారులున్నట్లు లీక్ అందింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నయీం సొంతూరు భువనగిరికి చెందిన ఎంపీపీ వెంకటేశ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఏపీకి చెందిన అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతల పేర్లు, ఫోన్ నంబర్లతోపాటు ఆస్తుల వివరాలు కూడా అందులో ఉన్నట్లుగా సమాచారం. పొలిటీషియన్స్, పోలీసులతోపాటు పాటు నయీమ్ దోస్తుల జాబితాలో పలువురు ప్రముఖ జర్నలిస్టులు కూడా ఉన్నారట. డైరీలోని పేర్లను ఒక్కటొక్కటిగా పరిశీలిస్తున్న పోలీసులు... గోప్యతను ప్రదర్శిస్తూనే వారు నెరపిన వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.

నయీంకు ఆ రోగం ???
వేల కోట్ల సంపదతో సుఖ భోగాలను అనుభవించిన నయీంకు ప్రాణాంతక వ్యాధితో భాదపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నెక్ నాంపూర్ లోని అతడి ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. సదరు ఇంటిలో ఇద్దరు మహిళలతో పాటు ఏడుగురు అమ్మాయిలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... వ్యాధికి సంబంధించి మందులను కనుగొన్నారు. అమ్మాయిలను సెక్స్ కార్యాకలాపాలకోసం, సెటిల్ మెంట్ల కోసం వాడుకుని, ఆపై అమ్మేవాడని నయీంపై ఆరోపణలు ఉన్నాయి.

బెడ్ రూం రహాస్యం వీడేనా?
పోలీసులు అల్కాపురి ఇంట్లో దాడిచేసిన సమయంలో రెండో అంతస్థులోని నయీం బెడ్ రూం ను మాత్రం తెరవలేదు. దీనికి కోర్టు అనుమతి తప్పని సరి. ఈ క్రమంలో సదరు గదిని బద్దలుకొట్టేందుకు అనుమతించాలని నిన్న పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించిన కోర్టు ఆ గది తలుపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో నేడు నయీమ్ బెడ్ రూం తాళాన్ని పోలీసులు బద్దలు కొట్టనున్నారు. ఇప్పటికే ఆ ఇంటిలోని ఇతర గదుల్లో లభించిన సమాచారంతోనే పోలీసులు షాక్ తినగా... ఇక అత్యంత రహస్య ప్రదేశంగా భావిస్తున్న నయీమ్ బెడ్ రూంలో ఏ తరహా కీలక సమాచారం దొరుకుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gangster  naeem  encounter  dairy  names  

Other Articles