raghuram rajan may keep rate static in his last monetary policy

Rbi governor may keep rate static in his last monetary policy

raghuram rajan, rajan, rbi rajan, rate cut, interest rate rbi, rbi raghuram rajan, monetary policy committee, rbi news, no second term for rajan, RBI, monetary policy, CRR, repo rate, reverse repo rate, RBI governor, Reserve Bank of India

In conjunction with naming its 3 members on the Monetary Policy Committee, the government is also likely to name a successor to Raghuram Rajan sometime this month.

అర్బీఐ గవర్నర్ రాజన్ చివరి ద్రవ్యపరపతి సమీక్ష. వడ్డీ రేట్లు తగ్గుతాయా..?

Posted: 08/08/2016 09:23 PM IST
Rbi governor may keep rate static in his last monetary policy

రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా రఘురామ్ రాజన్ తన చిట్టచివరి ద్రవ్య, విధాన పరపతి సమీక్షా సమావేశంలో మెరుపులు మెరిపిస్తారా...? వెళుతూ వెళుతూ రేట్లను కోసేసి పారిశ్రామిక, బ్యాంకింగ్, మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తారా..? చాలామంది ఇలాగే ఆలోచిస్తుండటంతో ఇప్పుడు అందరి కళ్లూ భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్షపైనే పడ్డాయి. తన హయంలో భారత ఆర్థిక పరిస్థితిని మందగమనం నుంచి కాపాడిన వ్యక్తిగా పలువురి ప్రశంసలు అందుకున్న రాజన్.. చివరి కాలంలో మాత్రం బీజేపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి నుంచి విమర్శలను ఎదర్కోన్నాడు. అయితే ఈ అంశంపై కేంద్రమంత్రుల నుంచిగానీ, లేక ప్రధాని నుంచి కానీ ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన తాను రెండో పర్యాయం చేయనని ప్రకటించారు, ఆ తరువాత ఆయనకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడీ పలు వ్యాఖ్యలు చేప్పారు, అయితే అప్పటికే చేతుల కాలడంతో రాజన్ వీడ్కోలు పలికే సమయం రానేవచ్చింది.

సెప్టెంబర్ 4న ఆర్‌బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న రాజన్‌కు ఇదే చివరి పరపతి విధాన సమీక్షా సమావేశం. రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే కొనసాగుతున్నందున ఆర్‌బీఐ రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ, అధిక వడ్డీ రేట్లను కొనసాగిస్తున్నారన్న విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజన్ కీలక రేట్లలో మార్పులు చేసే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చునని, ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలో 5.7శాతానికి పెరగడంతోపాటు జూలై, ఆగస్టు నెలల్లోనూ అధిక స్థాయిల్లోనే కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి వడ్డీ రేట్లలో కోత అన్నది ద్రవ్యోల్బణం తీరు, మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటుపైనే ఆధారపడి ఉంటేందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuram rajan  RBI  monetary policy  CRR  repo rate  reverse repo rate  RBI governor  Reserve Bank of India  

Other Articles