సేవా గుణం ఎక్కువ ఉన్నవారు సెక్స్ లో హీరోలు | People who help others are more desirable to the other gender

People who help others are more desirable to the other gender

personality trait is the key to more sex, better quality for good sex, good sex quality

People who help others are more desirable to the other gender.

దయా గుణం ఎక్కువయితే బెస్ట్ రసికులు మీరే

Posted: 08/08/2016 03:15 PM IST
People who help others are more desirable to the other gender

దాంపత్య జీవితం సజావుగా సాగడంలో శృంగారం అనేది కీలకపాత్ర పోషిస్తుంది. ప్రేమను, అన్యోన్యతను పెంచడంలో ఇది చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. భాగస్వామ్యులు ఇద్దరు శృంగారాన్ని ఆనందించి మరింత ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అయితే తీవ్ర ఒత్తిడిలో ఉన్న నేటి జంటలు తమ భాగస్వాములతోనే కాదు, సెక్స్ కోసం పక్క దారి పడుతున్న ధాఖలాలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిలో ఆరోగ్యవంతమైన శృంగారం పక్కదారి పట్టిపోతుంది..

అయితే అందుకు కావాల్సింది దయాగుణం అని చెబితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది. కానీ, కెనడా శాస్త్రవేత్తలు సర్వేతోసహా దీనిని నిరూపించి చూపారు. గులెప్ మరియు నిపిస్సింగ్ యూనివర్సిటీలు 800 జంటలపై ఏడు వారాలు పరిశోధనలు చేసి ఈ విషయం చెబుతున్నారు. ఎలాంటి కల్మషం లేకుండా నిస్వార్థవంతమైన వ్యక్తులే శృంగారంలో మంచి అనుభూతిని పొందుతున్నారని దాని సారాంశం.

ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచించేవారు, పరోపకార గుణం అతిగా ఉన్నవారు, డేటింగ్ లలో, తమ పార్ట్ నర్ లతో శృంగారంలో విన్నర్ లుగా నిలుస్తున్నారని అంటోంది. అలాంటి వారికే అమ్మాయిలు త్వరగా ఆకర్షిస్తులవుతున్నారంట.  అయితే ఇది ఈ జనరేషన్ నుంచే కాదని, ఆదిమ మానవుల కాలం నుంచే మనుషుల్లో పెరిగిపోయిన గుణమని చెబుతూ వేట తర్వాత ఆహారాన్ని పంచే క్రమంలో తమ భాగస్వాములను ఎంచుకుని శృంగారంలో పాల్గొనేవారని సహేతుక కారణాలతో వివరించింది.

ఇతరుల కోసం ఆరాటపడటం, వారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలన్న తపన ఎదుటి వారిలో ప్రేమను పెంచి, శారీరక సంబంధానికి దారితీస్తుందని తెలిపిన ఆ నివేదిక, తద్వారా అది ఆరోగ్యవంతమైన శృంగారానికి కారణమవుతుందని వివరిస్తోంది. అయితే ఒక్కోసారి అది హోమో లేదా లెస్బియన్ లాంటి అసహాజమైన రిలేషన్ షిప్ కు కూడా దారితీయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కథనం బ్రిటీష్ జర్నల్ ఆఫ్ సైకాలజీలో ప్రచురితమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Good Sex  personality trait  desirable  Others  

Other Articles