చంద్రబాబుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు | Undavalli Arun Kumar Controversial Comments On CM Chandrababu

Arun kumar controversial comments on cm chandrababu

Undavalli Arun Kumar Controversial Comments, Undavalli On CM Chandrababu, Undavalli on Polavaram, Undavalli funny story

Undavalli Arun Kumar Controversial Comments On CM Chandrababu.

ITEMVIDEOS:అరిటాకు-ముళ్లు కథలో క్లారిటీ ఇచ్చాడా?

Posted: 08/03/2016 01:58 PM IST
Arun kumar controversial comments on cm chandrababu

ప్రత్యేక హోదాపై మొండి చేతులు చూపించిన కేంద్రం వైఖరిపై ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు కక్కుతాడనుకుంటే చల్లగా మాట్లాడటం విస్మయం కలిగించేదే. అరుణ్ జైట్లతో ఫోన్లో మాట్లాడానని, ఈ విషయమై మరిన్ని చర్చలు అవసరమని ఆయన అన్నారని చెప్పటం వెనుక ఆంతర్యం బాబుకే అర్థం కావాలి. ఈ క్రమంలో బీజేపీ ఏపీ రెండేళ్ల పసి పాప అని పేర్కొన్న ఆయన, ప్రత్యేక హోదాతోనే అన్ని రకాలుగా న్యాయం చేసినట్లు అవుతుందని చెప్పుకోచ్చాడు.

చివరగా.... కేంద్రం కటీఫ్ గురించి మాట్లాడుతూ... అరిటాకు వెళ్లి ముల్లు మీద పడ్డా, ముల్లు వచ్చి అరిటాకు మీదపడ్డా నష్టం అరిటాకుకేనని అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలో ఎవరు అరిటాకో... ఎవరు ముళ్లో చెప్పకపోవటంతో మీడియా మిత్రులు కాసేపు తలలు పట్టుకున్నారు. కానీ, ఈ విషయంలో తాను క్లారిటీ ఇస్తానంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ . నిన్నగాక మొన్న హోదాపై, టీడీపీ-బీజేపీ వైఖరిపై కడిగిపడేసిన ఆయన ఈరోజు మరోసారి మీడియా ముందు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించిన ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైఖరిపై నిప్పులు చెరిగారు. అరటాకు-ముళ్లు కథ ఆంతర్యమేమిటో చెప్పాలని ఆయన చంద్రబాబును ప్రశ్నించిన ఆయన దానికి తనదైన శైలిలో వివరణ కూడా ఇచ్చారు. బాబు చెప్పిన అరిటాకు, ముళ్లు కథలో... బీజేపీ ముళ్లు అయితే, అరిటాకు ఏపీ కాబోదని, ఆ ఆకు చంద్రబాబే అవుతారని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడతారో, ద్రోహం చేసి చరిత్రలో నిలిచిపోతారో తేల్చుకోవాలని ఉండవల్లి సవాల్ విసిరాడు. మొత్తానికి బీజేపీ అనే ముళ్లు చేసే మోసానికి ఆకు ఏదైనా సరే చినిగిపోవాల్సిందే కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Undavalli Arun Kumar  Controversial Comments  AP CM  Chandra babu  special status  

Other Articles