చిన్న గొడవకు ఆస్పత్రి వార్డుకు నిప్పుపెట్టాడు | Man sets entire hospital ward on fire after clash with patient

Man sets entire hospital ward on fire after clash with patient

Man sets entire hospital ward, clash with patient fire, Man sets fire tio patient

Man sets entire hospital ward on fire after clash with patient on fire after row with dialysis patient turns deadly.

ITEMVIDEOS:చిన్న గొడవతో హస్పిటల్ వార్డుకి నిప్పుపెట్టాడు

Posted: 07/28/2016 10:18 AM IST
Man sets entire hospital ward on fire after clash with patient

క్షణికావేశంలో చేసే పొరపాటుతో ఎంత మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందో వివరించే ఘటన ఇది. ఓ చిన్న తగదాను మనసులో పెట్టుకున్న వ్యక్తి చేసిన పనికి తనతోపాటు మరో రెండు జీవితాలను బలితీసుకోగా, ఒకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. లండన్ లోని ఓ అల్బెనియన్ ఆస్పత్రిలో పెషెంట్ తో గొడవ పెట్టుకుని ఏకంగా వార్డు మొత్తానికి నిప్పటించాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళ్లితే...

57 ఏళ్ల సెనాజ్ లెఫ్టర్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పెషెంట్ తో గొడవకు దిగాడు. సిబ్బంది సర్దిచెప్పటంతో శాంతించిన సెనాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికే ఓ పెట్రోల్ బాటిల్ తో తిరిగొచ్చిన సెనాజ్ ఆ పెషెంట్ పై పోసి, నిప్పటించాడు. ఇదంతా గమనిస్తున్న పక్కనున్న ఓ స్టాప్ నర్సు అడ్డుకోవటానికి ప్రయత్నించగా వీలుపడలేదు.

 

సెనాజ్, నర్సు, పక్కనే చికిత్సపొందుతున్న ఓ పెషెంట్ మొత్తం ముగ్గురు ఈ ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందారు. అయితే దీనంతటికి కారణమైన పెషెంట్ 38 ఏళ్ల సారాసి మాత్రం చావు బతుకుల మధ్య ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణమంతా అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : London  Albenian hospital  Man sets fire  hospital ward  

Other Articles