ఐరన్ లేడీ షర్మిల దీక్షవిరమణ | Iron lady Irom Sharmila To End Fast After 16 Years

Iron lady irom sharmila to end fast after 16 years

Iron lady Irom Sharmila, Assamiron lady, Irom sharmila end past, 16 years past end, sharmila marriage, sharmila political entry, Sharmila AFS

Iron lady Irom Sharmila To End Fast After 16 Years, Wants To Marry, Fight Elections.

ఐరన్ లేడీ షర్మిల అనూహ్య నిర్ణయం

Posted: 07/26/2016 07:08 PM IST
Iron lady irom sharmila to end fast after 16 years

అసోం ఉక్కుమహిళగా పేరుగాంచిన ఇరోమ్ షర్మిల (42) తన 16 ఏళ్ల నిరాహార దీక్షకు ముగింపు పలకనుంది. ఇంఫాల్ లో భద్రతా దళాలు జరిపిన కాల్పులకు నిరసనగా 2000 నవంబర్ నుంచి సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఇరోమ్ షర్మిళ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ (టీపీఎన్) ద్వారా మాత్రమే జీవిస్తున్నారు.

కల్లోలిత ప్రాంతాల్లో భారత ప్రభుత్వం 1958 నుంచి ప్రయోగిస్తున్న ఏఎఫ్ ఎస్ పీఏను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ చట్టంప్రకారం ఎవరినైనా చంపే హక్కును సాయుధ దళాలకు సుమారుగా ఉంది!! అయితే ఈమె దీక్ష మొదలుపెట్టి ఇన్నేళ్లయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమె దీక్ష విరమించాలనే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు రాజకీయాలే మార్గమని భావిస్తోంది. ఇంఫాల్ లోని కోర్టు బయట మీడియాతో మాట్లాడిన షర్మిల.. ఆగస్టు 9న దీక్షకు ముగింపు పలకనున్నట్లు తెలిపారు. అనంతరం ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించారు.

ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలోని బస్ స్టాప్ లో నిలబడి ఉన్న పది మందిని అస్సాం రైఫిల్స్ సైనికులు కాల్చి చంపడంపై ప్రారంభమైన ఆమె దీక్ష ఇంతవరకూ పట్టువదలకుండా సాగింది. ఈమధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా మణిపూర్ ఆర్మీకి ప్రత్యేక హక్కుల చట్టాన్ని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే! అయితే దీక్ష విరమణ అనంతరం ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assam  Iron Lady  Irom Sharmila  Past  16 years  AFS  

Other Articles