ఆ వండర్ కిడ్ ఏమయ్యాడు? | marathon prodigy Budhia singh missing

Odisha cwc seeks report on child marathon prodigy budhia s missing

Odisha CWC , Budhia singh's missing, child marathon prodigy

Odisha CWC seeks report on child marathon prodigy Budhia singh's missing.

ఆ వండర్ కిడ్ ఏమయ్యాడు?

Posted: 07/15/2016 03:23 PM IST
Odisha cwc seeks report on child marathon prodigy budhia s missing

మారథాన్ బుడతడు బుదియా సింగ్ నెలరోజులుగా జాడ తెలీకుండా పోవటం ఒడిషాలో ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రస్తుతం 14 ఏళ్ల వయసున్న ఈ వండర్ కిడ్ కనపడకపోవడంపై తమకు నివేదిక ఇవ్వాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ శుక్రవారం ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

బుదియా మూడేళ్ల వయసులో మారథాన్, నాలుగేళ్ల వయసులో 40 మైళ్లు పరిగెత్తిన రికార్డుతో పాటు అతి చిన్న వయసులోనే 48 మారథాన్ లు పూర్తి చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కళింగ స్టేడియంలోని స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటున్నాడని అన్నారు. మే 10వ తేదీన వేసవి సెలవులకని తన తల్లి వద్దకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు.

నెలరోజుల నుంచి అతడి జాడ పత్తా లేకపోవటంతో ఆగ్రహాం వ్యక్తం చేసిన చైల్డ్ కమిటీ ఎటువంటి చర్యలు తీసుకున్నారనే విషయమై మూడు రోజుల్లోగా తమకు నివేదిక సమర్పించాలని స్పోర్ట్స్ హాస్టల్ ఇన్ చార్జ్ ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు బెనుధర్ సేనాపతి ఆదేశించారు. అయితే మనోజ్ బాయ్ పాయి ప్రదాన తారగణంతో బుధియా జీవిత గాథగా తెరకెక్కిన ‘బుధియా-బార్న్ టూ రన్’ చిత్ర ప్రమోషన్ కోసం ప్రస్తుతం ముంబైలో ఉన్నాడని చెబుతున్నప్పటికీ దానిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Odisha  Marathon kid  Budhia singh  missing  

Other Articles