పాల లొల్లి ఢిల్లీకి చేరింది | Telugu states Vijaya dairy milk issue reached Delhi

Central interferes in telugu states vijaya dairy milk clash

Vijaya Dairy milk clash between telugu states, Vijaya Dairy milk in telangana, Vijaya Dairy milk in AP

Central interferes in telugu states Vijaya dairy milk clash.

విజయ పాల లొల్లి ఢిల్లీకి చేరింది

Posted: 07/13/2016 10:01 AM IST
Central interferes in telugu states vijaya dairy milk clash

ఓవైపు ప్రత్యేక కోర్టు కోసం కొట్టేసుకుంటున్న తరుణంలో మరో వివాదం రెండు రాష్ట్రాల మధ్య చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. అయితే ఇంతకు ముందు సమస్యల్లాగానే దీనిని కూడా పరిష్కరించేందుకు కేంద్రం చొరవతీసుకోంటోంది. విజయా బ్రాండ్ పాల విక్రయాలపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఈ నెల 15న ఢిల్లీకి రావాలని ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

సమస్య ఏంటంటే...

తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ‘విజయా’ బ్రాండ్ పాలను ప్రభుత్వమే మౌలాలిలోని కేంద్రం ద్వారా ప్రాసెస్ చేసి విక్రయించేది. ఏపీ డెయిరీ సమాఖ్య ద్వారా కొనసాగిన ఈ వ్యాపారం విభజన తర్వాత కూడా ఇరు రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాలు కూడా ‘విజయా’ బ్రాండ్ పేరిటే పాలను విక్రయిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ‘విజయా’ పాత బ్రాండ్ తోనే ఈ వ్యాపారం చేస్తుండగా, తెలంగాణ సర్కారు మాత్రం ‘విజయా’ బ్రాండ్ కు ‘తెలంగాణ’ ట్యాగ్ తగిలించి... తెలంగాణ పాడి సమాఖ్య ద్వారా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.

అదే సమయంలో ఏపీ సర్కారు అక్కడి పాలను తెలంగాణ రవాణా చేసి మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉన్న సాంబశివా డెయిరీ వద్ద ప్రాసెస్ చేయించి తెలంగాణలోకి వదులుతోంది. విషయం తెలిసిన తెలంగాణ పాడి సమాఖ్య సదరు పాలు విజయా బ్రాండ్ వి కాదని, అవి నకిలీవంటూ వారం క్రితం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఏపీ తెలంగాణ పాడి సమాఖ్య ప్రకటన పూర్తిగా అవాస్తవమని వివరణ ఇచ్చుకుంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం మరింత ముదిరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijaya milk  Andhra Pradesh  Telangana  

Other Articles