పచ్చని ఆశయ సాధనకు గ్లామర్ కళ | T govt using cine glamour for Harith Haram

T govt using cine glamour for harith haram

Allu Arjun in Haritha Haram, T govt using glamour for Haritha Haram, KTR ans Harish rao in Haritha Haram

Telangana govt using celebraties support to haritha haram success. Allu arjun, rana etc actors participate in this programme.

ITEMVIDEOS:పచ్చని ఆశయ సాధనకు సూపర్ ఫ్లానింగ్

Posted: 07/11/2016 01:35 PM IST
T govt using cine glamour for harith haram

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయో, వాటి రూపకల్పన, అమలు చేసే తీరు చూస్తే  ఎవరికైనా మతిపోతుంది. ఏ రూట్ లో వెళితే అవి సక్సెస్ అవుతాయోనన్న పల్స్ ను పట్టుకుని ఆయన ముందుకు సాగుతుంటాడు. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేయడానికి ప్రారంభించిన బృహత్తర సంక్షేమ పథకం హరిత హరంకు ఇప్పుడు గ్లామర్ సొగసులు అద్దేసింది టీ ప్రభుత్వం.

chiranjeevi in hariha haram programme

Akkineni nagarjuna in haritha haram

 ఇప్పటికే అఖిల్, రకుల్ ప్రీత్ సింగ్, రాశిఖన్నా, రెజీనా లాంటి యువనటీనటులంతా ఇందులో పాల్గొనగా ఒక్క సోమవారమే దాదాపు స్టార్ సెలబ్రిటీలంతా ఇందులో బాగస్వాములయ్యారు. కేబీఆర్ పార్క్‌లో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తో పాటు నటుడు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, స్టార్లు శ్రీ‌కాంత్, శివాజీరాజా, త‌నికెళ్ల భ‌ర‌ణి తదితరులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బంజారాహిల్స్‌లోని త‌న ఇంటి వ‌ద్ద ఏర్పాటు చేసిన హ‌రితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. త‌న భార్య సేహా రెడ్డి, కుమారుడు అయాన్‌ తో క‌లిసి మొక్క నాటి ప్రారంభించాడు. ఇందులో నిర్మాత అల్లు అర‌వింద్ కూడా పాల్గొన్నాడు. నగరాన్ని పచ్చగా త‌యారు చేయ‌డం మ‌న‌కీ, మ‌న త‌రువాతి త‌రానికి మంచిద‌ని, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తు కేసీఆర్ ప్రభుత్వం మంచిపని చేస్తోందని బన్నీ ఈ సందర్భంగా తెలిపాడు. ఇక నగరంలో అక్కడక్కడా అల్లు అర్జున్ పేరుతో హరితహరం పోస్టర్లు వెలువడటం విశేషం.

మరోవైపు సినీయర్ హీరోలు చిరంజీవి, నాగార్జునలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక పిల్మ్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మ‌హ‌మూద్ అలీతో కలిసి సీనియర్ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ హ‌రితహారంలో పాల్గొన్నారు. నగర శివారులోని నాన‌క్ రామ్ గూడ‌లో న‌టుడు ద‌గ్గుబాటి రానా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాడు. వీరితోపాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేటీఆర్, హరీష్ రావు, నగర సీపీ ఆనంద్ తదితరులంతా హరితహరంలో నగరమంతా హడావుడి చేశారు. మొత్తం మీద తన పథకం సక్సెస్ అయ్యేందుకు సూపర్ స్కెచ్ వేసుకుని ముందుకు నడుస్తున్నారు తెలంగాణ సీఎం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagana  haritha haram  Celebrities  Allu arjun  Rana  KTR  Harish rao  

Other Articles