డల్లాస్ కాల్పులపై జాతి వివక్ష మరకలు | Dallas snipers row Obama says despicable attack

Dallas snipers row obama says despicable attack

Dallas sniper attack, Racism on Dallas sniper attack, Obama shocking statement on Dallas attack

Dallas sniper attack: 5 officers shot dead during protests against police, Obama Says despicable attack.

డల్లాస్ కాల్పులపై జాతి వివక్ష మరకలు

Posted: 07/08/2016 05:10 PM IST
Dallas snipers row obama says despicable attack

అమెరికాలో న‌ల్ల జాతీయుల‌పై పోలీసుల కాల్పుల‌కు నిర‌స‌న‌గా చేప‌ట్టిన‌ ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. మిన్నెసోటా, లూసియానాల్లో అమెరికన్ పోలీసులు ఇద్దరు నల్ల జాతీయులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో ఆందోళనలు చెలరేగగా, నిరసనకారుల‌ను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు.

ఇక ఆందోళ‌నకారులు పక్కా ప్రణాళికతో జరిపిన కాల్పులలో ఐదుగురు పోలీసులు మరణించారు. మ‌రో ఏడుగురికి కాల్పుల్లో తీవ్రగాయాల‌య్యాయి. పోలీసులే లక్ష్యంగా ఈ కాల్పులు జ‌రిగిన‌ట్లు స్ఫష్టంగా తెలుస్తోంది. అయితే కాల్పులకు పాల్పడిన వారిలో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, డల్లాస్ లో పలు చోట్ల బాంబులు పెట్టినట్లు సమాచారం రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అది నిరసనకారుల పని కాదని అల్లర్లను ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులే ఈ చేష్టకు దిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం డ‌ల్లాస్‌కు ఎయిర్ పోర్ట్ కు రాక‌పోక‌ల‌పై ఆంక్షలు విధించారు.

ఒబామా షాకింగ్ వ్యాఖ్యలు:

Obama Shocking statement on Dallas Attack
కాగా, ఈ ఆందోళనలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశాడు. చూస్తుంటే ఇది జాతి వివక్ష చర్యలాగానే కనిపిస్తోందని పేర్కొన్నాడు. భద్రతా కారణాల దృష్ట్యా ఎక్కువ మంది నల్లజాతీయులే బలవుతుండటం బాధకరమని వ్యాఖ్యానించాడు.

నాటో సమావేశం కొరకు పోలెండ్ లోని వార్సాకు చేరుకున్న ఒబామా మీడియాతో మాట్లాడారు. ఇలాంటి క్రూరమైన ఘటనల వల్ల అమెరికన్లందరూ ఇబ్బందులకు గురవుతారని వ్యాఖ్యానించారు. నల్లజాతీయులపై పోలీసులు జరిపిన కాల్పులు కావాలని చేసినవిగానే కనిపిస్తున్నాయని అన్నారు. అదే సమయంలో నల్లజాతీయుల ప్రాణాలు ముఖ్యం అంటే మిగిలిన వారి ప్రాణాలు తృణప్రాయం కాదని, ఎవరిదైనా జీవితమే అనే చెప్పటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  Dallas  sniper attack  

Other Articles