ఏపీ స్మార్ట్ పల్స్ సర్వే ప్రారంభం | Smart Pulse Survey' Began in AP

Smart pulse survey began in ap

Andhra Pradesh Govt Smart Pulse Survey, Chandrababu Naidu Smart Pulse Survey details, Chandra babu Smart Pulse Survey details

Andhra Pradesh Govt Smart Pulse Survey Began From CM Chandrababu Naidu House.

ITEMVIDEOS: ఏపీ స్మార్ట్ పల్స్ సర్వే ప్రారంభం

Posted: 07/08/2016 11:19 AM IST
Smart pulse survey began in ap

రాష్ట్రంలోని అన్ని కుటుంబాల వివరాల సేకరణలో బాగంగా ఏపీ ప్రభుత్వం స్మార్ట్ పోల్ సర్వేను (ప్రజా సాధికార సర్వే) ప్రారంభించింది. శుక్రవారం ఉదయం ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నుంచే ఈ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఆయన ఓపికగా తన వ్యక్తిగత వివరాలను దగ్గరుండి మరీ వివరించారు. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకి జిరాక్స్ అని చెబుతున్నప్పటికీ, పూర్తిగా ఆన్ లైన్ లోనే దీనిని నిర్వహిస్తుండటం విశేషం.

ప్రతీ పౌరుడి ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకోవటంతోపాటు, వారికి చెందాల్సిన హక్కులను అందజేయడమే దీని లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.  మొత్తం ఆరు వారాలపాటు కొనసాగనున్న ఈ సర్వేలో మొత్తం 30 వేల మంది అధికారులు పాల్గొంటారు. ఇళ్లు, భూమి, ఆదాయం తదితర వివరాలతోసహా మొత్తం 83 అంశాలపై పూర్తి వివరాలను సేకరిస్తారు. రోజుకు ఒక్కొక్కరు 15 నుంచి 20 కుటుంబాల సమాచారం లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు కేవలం యాప్‌ద్వారానే 1.48 కోట్ల కుటుంబాల వివరాలు సేకరించేందుకు సిద్ధమైపోతున్నారు..

ఆధార్‌, కుల, ఆదాయం వంటి 20 పత్రాల ద్వారా వివరాలు సేకరించనున్నారు. జిప్పర్‌ కోడ్‌ పేరిట ప్రతి ఇంటికీ 8 లక్షరాల్లో సరికొత్త డిజిటల్‌ నెంబర్లు ఇస్తారు. పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ అందించడం, ప్రతీ పౌరుడి ఆధార్ ను అన్ని పథకాలకు అనుసంధానం దీని ప్రత్యేకతగా చెబుతున్నారు. ఆధార్‌ కార్డు లేని వారికి వేలిముద్రలు, బ్యాంకు ఖాతాలు లేని వారికి అప్పటికప్పుడే తెరిచేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొత్త సభ్యుల చేరికతోపాటు తప్పుల సవరణకు వీలుగా అవకాశం కల్పించనున్నారు.  

సర్వే ఆధారంగా ఆధార్, కుల, ఫోటోలను తీసి జీపీఎస్ కు అనుసంధానం చేస్తారు. ఇక నుంచి ఆన్‌లైన్‌ ద్వారా వ్యక్తిగత సమాచారంతోపాటు, ఇంటి చిరునామాను, మొబైల్ నంబర్ ను తెలుసుకునేలా ఏర్పాట్లు కల్పిస్తున్నారు. ఈ నెల 31 వరకు తొలివిడత సర్వే జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  CM Chandrababu Naidu  Smart Pulse Survey  

Other Articles