మోదీ స్కెచ్ ఎందుకు మారిందంటే... | Why Venkaiah naidu and Smriti Irani lost their ministries

Why venkaiah naidu and smriti irani lost their ministries

Venkaiah naidu and Smriti Irani lost their ministries, Smriti Irani textile, Javadekar replaced smriti irani, Modi Smriti irani

Why Venkaiah naidu and Smriti Irani lost their ministries. Narendra Modi's Cabinet expansion who got what ministry.

వెంకయ్య, ఇరానీల శాఖలు ఎందుకు మారాయంటే...

Posted: 07/06/2016 03:43 PM IST
Why venkaiah naidu and smriti irani lost their ministries

మోదీ మంత్రి వర్గ విస్తరణకు ముందు ఎంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిందో... ప్రస్తుతం శాఖల మార్పు కూడా అదే రీతిలో జరిగింది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు రెండేళ్ల పాలనలో తమను పట్టించుకోలేదని హ్యాపీగా ఫీలయిన మంత్రుల లోసుగులను చటుక్కున పట్టేసి కొందరికి ఉద్వాసన పలకగా, మరి కొందరికి శాఖా కేటాయింపులు చేసేశారు. ఆ విస్తరణను గనక క్లియర్ గా పరిశీలిస్తే యూపీ ఎన్నికలను ఆధారంగా చేసుకున్నారన్నది ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.

ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి పలు ఆసక్తికర కథనాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు మరో కీలక శాఖ సమాచార, ప్రసార శాఖను (ఐ అండ్ బీ) అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ అదే సమయంలో ఆయన్ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖను తప్పించేశారు. ఆ శాఖను వివాదారహితుడు రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి అనంత నాగ్ కు అప్పజెప్పారు.

ఇక వరుస వివాదాలకు నిలయమైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను స్మృతి ఇరానీ నుంచి తప్పించి, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సూచన మేరకు ఆమెకు టెక్స్ టైల్స్ శాఖను అప్పజెప్పారు. బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ కు హెచ్ ఆర్డీ శాఖను అప్పగించారు. మొత్తం 19 మంది కొత్త వారికి స్థానం కల్పించిన మోదీ జవదేకర్ ఒక్కరికి మాత్రమే ప్రమోషన్ ఇచ్చారని చెప్పొచ్చు. నిన్నటిదాకా కేంద్ర పర్యావరణ మంత్రి (స్వతంత్ర హోదా)గా ఉన్న జవదేకర్... పర్యావరణ, అటవీ శాఖలకు సంబంధించి అనుమతుల జారీలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించారు. ఈ విషయంలో ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. గత ప్రభుత్వాల హయాంలో ఈ శాఖను నిర్వహించిన మంత్రుల పనితీరుతో పోలిస్తే జవదేకర్ సమర్థవంతంగా పనిచేసినట్లే లెక్క. కేంద్రంలోని ఉన్నతాధికారులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఓవైపు వివాదాలతో సతమతమవుతున్న ఇరానీని కీలకశాఖలో కొనసాగించడం మంచింది కాదన్న అభిప్రాయంకి వచ్చిన మోదీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిజాయితీపరుడిగా పేరుబడ్డ  జవదేకర్ కు హెచ్ ఆర్డీ శాఖను అప్పగించారని తెలుస్తోంది.

హిందూత్వ పార్టీగా పేరుపడ్డ బీజేపీలో మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. పార్టీపై విపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రధానిగా మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన నాడే నఖ్వీకి మంత్రి పదవి ఖాయమన్న వాదనా లేకపోలేదు. అయితే నాడు నఖ్వీకి అవకాశం దక్కలేదు. కానీ, మంచి వాక్చాతుర్యం కలిగిన నఖ్వీకి ఈ దఫా కేంద్ర కేబినెట్ లోకి ఎంట్రీ ఖాయమేనన్న వాదన వినిపించింది.  మైనారిటీ వర్గానికే చెందిన పార్టీ సీనియర్ నేత నజ్మా హెప్తుల్లాకు ఛాన్సిచ్చిన మోదీ... నఖ్వీకి తదుపరి అవకాశం ఇస్తారని హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. నిన్నటి కేబినెట్ విస్తరణపై వినిపించిన ఊహాగానాల్లో... నజ్మాకు ఉద్వాసన పలకనున్న మోదీ... నఖ్వీని తన కేబినెట్ లోకి చేర్చుకుంటారని అంతా అనుకున్నారు.

అయితే ఆ ఊహాగానాలు.. ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. నజ్మాను తప్పించేందుకు ఇష్టపడని మోదీ... నఖ్వీకి కూడా అవకాశం ఇవ్వలేకపోయారు. వయోభారంతో ఉన్న నజ్మాకు ఉద్వాసన మైనారిటీ వర్గాల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తుందన్న భయంతో మోదీ ఆమెను తప్పించలేకపోయారు. ఈ క్రమంలోనే నఖ్వీని ఎలాగైనా మంత్రివర్గంలోకి చేర్చుకోవాలన్న మోదీ తన నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారని అర్థమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah naidu  modi  Smriti Irani  prakash javadekar  Najma Heptulla  

Other Articles