Ramdev-Promoted Patanjali Ayurved Pulled up For Misleading Ads

Patanjali under lens for misleading advertising

Business, ASCI, Baba Ramdev, Patanjali Ayurved, Consumer Complaints Council, Patanjali, dant kanthi, garnier, misleading, advertising,

Advertising watchdog ASCI has once again pulled up yoga guru Baba Ramdev-promoted Patanjali Ayurved for running "misleading" ad campaigns that disparages competitors' products

పతాంజలి దంత్ ‘కాంతి’ లేదట..

Posted: 07/05/2016 04:16 PM IST
Patanjali under lens for misleading advertising

ఎఫ్ఎంసీజీ రంగంలో టాప్ కంపెనీలకు  పోటీగా దూసుకు వస్తున్న  యోగా గురు బాబా రాందేవ్ కంపెనీ పతంజలి అయుర్వేద సంస్థకు మరోసారి ఎదురు దెబ్బతగిలింది. ఆయుర్వేదంలో ఆయన సాగిస్తున్న విప్లవాత్మక మార్పులతో అటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ అయుర్వేద ఉత్పత్తులకు అంబాసిడర్ పదవితో పాటు.. కేంద్రంలోని బీజేపి అశీస్సులతో పలు బీజేపిపాలిత రాష్ట్రాలలో తమ సంస్థకు కారుచౌకగా వందల ఏకరాల భూమి కేటాయించుకోవడం కూడా రసకందాయంలో పడింది. ఇటీవల వంట, హెయిర్ నూనెల ప్రకటనతో ఇబ్బందులు పడ్డ పతంజలి సంస్థకు అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎఎస్సీఐ)  మళ్లీ మొట్టికాయలు వేసింది.

దేశంలో అనేక ఉత్సత్తుల సంస్థలు చేస్తున్న ప్రచార ప్రకటనలపై ఈ సంస్థ వాచ్ డాగ్ స్కానర్ గా బాధ్యతలు నిర్వహిస్తుంది. బాబా రాందేవ్ కు చెందిన పతాంజలి సంస్థ ఉత్సత్తులైన 'దాంత్ కాంతి' టూత్ పేస్టు ప్రకటనలో ఆ సంస్థ తప్పుడు విషయాలు పేర్కొంటోందని తెలిపింది. పతంజలి ఉత్పత్తుల్లో ఎక్కువ ఆదరణ పొందిన 'దాంత్  కాంతి ' ప్రకటనలో చెబుతున్నట్టుగా ఎఫెక్టివ్ గా లేదని  వివరించింది. దంతస్రావం, వాపు, చిగురులు బ్లీడింగ్, పళ్లు పసుపు వర్ణం నుంచి తెలుపు రంగులోకి మారడం, సెన్సిటివిటీ, దుర్వాసన లాంటి సమస్యలకు బాగా పనిచేస్తుందనేది నిరూపించబడలేదని  కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ ప్రకటన ద్వారా పతంజలి  మోసానికి పాల్పడిందని తెలిపింది.  

క్రిములు, సూక్ష్మజీవుల నుంచి పళ్లను దీర్ఘకాలం రక్షిస్తుందని ప్రకటించి తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించింది. అలాగే సంస్థ మిగిలిన ఉత్పత్తులైన ఆవాల నూనె పతంజలి ప్రకటనలు,  పండ్ల రసాలు, పశువుల దాణా ప్రకటనల పై కూడా సందిగ్ధతను వ్యక్తం చేసింది. ఈ ప్రకటనలలోని విశ్వసనీయతపై సందేహాలను వ్యక్తం చేసింది. పతంజలితోపాటుగా అనేక కంపెనీ యాడ్స్ పై  అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెచ్ యూఎల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, కెల్లాగ్ ఇండియా, లోరియల్, కాల్గేట్ పామోలివ్ వంటి కంపెనీ ప్రకటనలను కూడా సంస్థ తప్పుబట్టింది. ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించింది.

న్యూ గార్నియర్ కంప్లీట్ డబుల్ యాక్షన్ ఫేస్ వాష్, హెచ్ యు ఎస్ చెబుతున్న ఇన్ స్టెంట్ వైట్నింగ్ ప్రకటనలపై సంస్థ తీవ్రంగా స్పందించింది.  న్యూ  గార్నియర్ వైట్ పూర్తి డబుల్ యాక్షన్, లోరియల్ ప్రకటనల్లో చెప్పినట్టుగా తక్షణ తెల్లబడటం వాస్తవం కాదని తేల్చిచెప్పింది. కేవలం క్రీమ్ ల వల్ల తెల్లగా కనిపిస్తారని  భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. డార్క్ స్పాట్స్ పై పోరాటం... తక్షణం తెల్లబడటం ఇదంతా మోసమని ఎఎస్సీఐ తెలిపింది. ఊహలతో ఆయా సంస్థలు తప్పుదోవ పట్టిస్తున్నాయని.. వినియోగదారులను మరోసారి ఆలోచించాలని కోరింది. మొత్తం 141 ఫిర్యాదులను విచారించిన సంస్థ 67ని సమర్థించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Patanjali  dant kanthi  garnier  misleading  advertising  ASCI  

Other Articles