ఆ పని చేసే వృశాలి కోట్లు వెనకేసుకుంది | accountant Vrushali Bamane arrested for allegedly cheating company

Accountant vrushali bamane arrested for allegedly cheating company

Vrushali Bamane, assistant accountant lavish life, Mumbai accountant grand cheating

The 29-year-old assistant accountant, Vrushali Bamane, who was arrested by the police for allegedly cheating her south Mumbai company out of Rs 16.32crore.

ITEMVIDEOS:ఆ పని చేసే వృశాలి కోట్లు వెనకేసుకుంది

Posted: 07/04/2016 06:55 PM IST
Accountant vrushali bamane arrested for allegedly cheating company

29 ఏళ్ల వృశాలి బొమనే ముంబైలో ఇప్పుడు మారు మోగిపోతుంది. ఎందుకంటే కేవలం ఓ చిరుద్యోగి అయిన ఆమె కోట్ల ఆస్తులను కూడబెట్టింది. చదివింది ఇంటరే. కానీ, లక్షలు ఖర్చుపెడుతూ మొగుడితో ఎంజాయ్ చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యుల అకౌంట్లలో లక్షలు మూలుగుతున్నాయి. ఇంతకీ ఆమెకి అంత సొమ్ములు ఎక్కడివి? అన్నదేగా మీ అనుమానం. అయితే ఈ స్టోరీ చదవండి...

వృశాలి బమానే ఓ చిన్న కంపెనీలో రెండేళ్లుగా అసిస్టెంట్ అకౌంటెంట్ గా పని చేస్తోంది. ఆమె జీతం 18 వేలు.. కానీ, ఆమె లగ్జరీ లైఫ్ చూస్తే ఎవరికైనా కళ్లు తిరగడం ఖాయం. ఎంప్లాయిస్ తో పాటు బాస్ ను మచ్చిక చేసుకుని కోట్ల రూపాయలను తన ఖాతాల్లోకి మళ్లీంచుకుంది. ఘరానా మోసంతో మొత్తం ఎనిమిది బ్యాంక్ అకౌంట్లకు ఆ సొమ్మును తరలించింది. అయితే ఆ తెలివిగా ఆ డబ్బును తన ఖాతాలోనే ఆమె ఉంచలేదు.

దాంతో మొగుడితో రాజభోగాలు అనుభవించింది. ఇంతకీ కంపెనీ కళ్లు గప్పి ఆమె వెనకేసుకున్న సొమ్ము ఎంతో తెలుసా? అక్షరాల 16 కోట్లు... అందులో సగం సొమ్మును కేవలం ఇంటి కోసమే ఖర్చు పెట్టిందట. ఆరు విలాసవంతమైన ఫ్లాటులు, నాలుగు కాస్ట్ లీ కార్లను కొనేసింది. అంతేకాదు ఫ్రీగా వచ్చిన సొమ్మని గిప్ట్ ల కింద కూడా ఖరీదైన వాటినే ఇవ్వటం ప్రారంభించిందట. ఇక కొడుకు బర్త్ డే కోసం 13 లక్షలు ఖర్చు పెట్టడంతో అనుమానం వచ్చిన యజమాని ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆమె గుట్టు బయటపడింది.

సొమ్మంతా వేరే ఎక్కడైనా దాచిందేమోనని అనుమానించిన పోలీసులకు ఆమె చేసిన ఖర్చులు చూసి కంగుతిన్నారంట. లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేయిట్ విమానాల్లో ప్రయాణించడం, బంధువుల పేరిట ఆస్తులను కొనటం లాంటిది చేసింది. ప్రస్తుతం ఆమె ఎంతో మోజు పడి కొన్న ఆస్తులను సీజ్ చేయటంతోపాటు, చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు ముంబై పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vrushali Bamane  assistant accountant  mumbai  lavish life  

Other Articles