Telangana approves for establishment of micro beweries

Kcr approves 20 micro beweries in telangana

draft beer, Telangana, beer, pubs, bars, supply of draft beer, Telangana government, excise department, telangana cm KCR, 20 micro bewerires, Minister padma rao

Telangana government approves to establish 20 micro beweries in the state for supply of draft beer

బీరుబాబులకు తీపికబురు..

Posted: 07/04/2016 07:03 AM IST
Kcr approves 20 micro beweries in telangana

తెలంగాణ బీరుభలులు తీపి కబరు. బీరుబాబులు బాటిళ్ల కోద్ది బీరు లాగిస్తూ.. జేబులు గుల్ల చేసుకుంటున్న తరుణంలో వారికి తెలంగాణ స్కరార్ తీయటి కబురును అందించింది, అంటే బీరు సీసాల ధరలను తగ్గించిందా..? అన్న అనుమానం వద్దు. ఎందుకంటే రాష్ట్రానికి ప్రధాన అదాయం అందిస్తున్న మద్యం వ్యవహరాల్లో రోజురోజుకు ధరలు పెరగడమే తప్ప, తగ్గడం తెలియని ప్రభుత్వాలకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ కొంతలో కొంత లాభం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటుంది.

ఔనా.., అన్న సందేహం అక్కర్లేదు..? ఇక సీసాలు సీసాలు తాగే బీరు లాగించే బీరు బాబులకు జేబులకు అధికంగా గుల్లచేయకుండా.. ఇక డ్రాఫ్ట్ బీర్లను ప్రవేశపెట్టనున్నారు. గతంలో పబ్ లు, కొన్ని బార్లలో డ్రాఫ్ట్ బీర్ల విక్రయం జరిగింది. కానీ ఆ తరువాత కాలానుగూణంగా వచ్చిన మార్పులతో రాష్ట్రంలో ఢ్రాఫ్ట్ బీర్లు కరుమరుగమయ్యాయి. దీంతో మళ్లీ డ్రాఫ్ట బీరును బీరుబాబులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభ్వుతం సన్నాహాలు చేస్తుంది. తయారు చేసి అప్పటికప్పుడు జగ్గుల్లో పోసి విక్రయించేలా 20 మైక్రో బ్లూవరీ సంస్థలకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇందుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు నుంచి వచ్చిన ఫైల్ పై కేసీఆర్ సంతకం చేశారు. తెలంగాణలో డ్రాఫ్ట్ బీర్ తయారీకి సంస్థలకు అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. ఒక్కో మైక్రో బ్రూవరీ నుంచి రూ. 3 లక్షల వరకూ లైసెన్స్ ఫీజును వసూలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం 50కి పైగా దరఖాస్తులు రాగా, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, ఎక్సైజ్, ఐటీ శాఖల కమిషనర్లు చంద్రవదన్, అనిల్ కుమార్ లు వీటిని పరిశీలించి స్క్రూటినీ చేశారు. ఈ డ్రాఫ్ట్ బీర్ కేవలం 36 గంటలు మాత్రమే నిల్వ వుంటుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : draft beer  Telangana  excise department  KCR  micro bewerires  Minister padma rao  

Other Articles