ఎన్ఐఏ అదుపులో 11 మంది.... భారీ ఎత్తున నరమేధంకి ఫ్లాన్ | NIA arrested 11 ISIS Sympathizers in Hyderabad

Nia arrested 11 isis sympathizers in hyderabad

NIA arrested 11 ISIS Sympathizers, ISIS Sympathizers in Hyderabad, NIA sleeper cells, ISIS Planed for Suicide Bombing And Mass Shooting, హైదరాబాద్ లో ఉగ్ర నరమేథం, భారీ విధ్వంసానికి కుట్ర, హైదరాబాద్ లో ఐఎస్ఐఎస్, తాజా వార్తలు, తెలుగు వార్తలు, తెలంగాణ వార్తలు, latest news, NIA news

NIA arrested 11 ISIS Sympathizers in Hyderabad. Planed for Suicide Bombing And Mass Shooting.

ITEMVIDEOS:ఎన్ఐఏ అదుపులో 11 మంది.... భారీ ఎత్తున నరమేధంకి ఫ్లాన్

Posted: 06/29/2016 04:04 PM IST
Nia arrested 11 isis sympathizers in hyderabad

మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన హిట్ చిత్రం తుపాకీ చిత్రం గుర్తుందా? అందులో హీరో స్లీపర్ సెల్స్ ను మట్టుబెడతాడు. కరుడుగట్టిన తీవ్రవాదుల నుంచి వచ్చే ఆదేశాలతో ఈ స్లీపర్ సెల్స్ పని చేస్తుంటారు. మాములు మనుషులుగా మనలో కలిసిపోయి జీవించే వీరు డబ్బు కోసమో లేక మతోన్మాదులతో చేతులు కలిపో ఘాతుకాలకు పాల్పడుతుంటారు. కాగా, సరిగ్గా ఇప్పుడు హైదరాబాద్ లో పట్టుబడుతున్న వారు స్లీపర్ సెల్స్ అన్న అనుమానాలు మొదలవుతున్నాయి.

మొదట ఐఎస్ఐఎస్ సానుభూతి పరులుగా అనుమానించినప్పటికీ క్రమంగా వారు వెల్లడిస్తున్న విషయాలతో ఏ ఉగ్రసంస్థకు చెందిన వారో తెలీనప్పటికీ వారు మాత్రం స్లీపర్ సెల్స్ అన్న విషయం నిర్ధారణ అవుతోంది. ఇబ్రహీం తల్లిదండ్రులు తమ కొడుకు అమాయకుడంటూ ఎన్ఐఏ ముందు బైఠాయించడం ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. వారు ఎవరనేది స్సష్టత లేకపోయినా విచారణలో వారు వెల్లడించే విషయాలు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయంట. నగరంలో భారీ ఎత్తున విధ్వంసం సృష్టిచేందుకు వారు పక్కా ప్లాన్ వేసినట్లు సమాచారం. బండ్లగూడ, చాంద్రాయణ గుట్ట ప్రాంతాల్లో ఇప్పటికే ఎయిర్ గన్ తో వీరు రిహార్సల్సు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఓ పక్క కాల్పులతోపాటు, రద్దీ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు నిర్వహించేందుకు పెద్ద ఫ్లాన్ తో వీరున్నట్లు తేలింది.

 

 

తెలంగాణ పోలీసుల సహకారంతో బుధవారం ఉదయం నుంచి నగరం మొత్తం జల్లెడ పట్టిన ఎన్ఐఏ అధికారులు ఇప్పటిదాకా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థాలు భారీ స్థాయిలో వీరి నుంచి సేకరించారు. మీర్ చౌక్, మొగల్ పురా, భవానీనగర్, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా గాలిస్తున్నారు. వీటితో పాటు పలు ఇతర ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు పట్టుబడ్డ నిక్కీ జోసెఫ్ తదితరులు విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా ఈ విషయాలు వెలుగు చూస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NIA  ISIS Sympathizers  sleeper cells  Suicide Bombing  Mass Shooting  hyderabad  

Other Articles