Shocking! Teenage girl gang-raped inside Delhi school by friend, security guard

Girl promised job in school gang raped on premises

gang rape, rape in school, job pretext, new delhi, Delhi school, Delhi Police, East Delhi, Jagatpuri, crime, rape on woman, gangrape on women, harrassment on women, violence on women, sexual assult on women, molestation on women

In a shocking incident, a teenage girl has alleged gang-rape by her friend and a security guard inside a private school in east Delhi.

ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి బాలికపై..

Posted: 06/29/2016 01:34 PM IST
Girl promised job in school gang raped on premises

పేదవాళ్ల బలహీనతను, అసహాయతను అసరగా చేసుకుని వారిపై కామాంధులు కాలుదువ్వుతున్నారు. నిర్మానుష్య ప్రాంతంతో వారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అకృత్యాలకు తెగబడుతున్నారు. తమతో ఎంతో కాలంగా పరిచయం వున్న వ్యక్తులు కూడా తమను తాజాగా కామవాంఛతో చూడటం, అ కోరికల కోసం తమపై పైశాచిక మృగాళ్ల మాదిరిగా తెగబడటంతో ఎవర్ని నమ్మాలో..? ఎవర్ని నమ్మకూడదో కూడా అర్థంకానీ స్థితికి అబలలు చేరుకుంటున్నారు. తాగాజా ఢిల్లీలోనూ ఇలాంటి ఘటనే జరగింది.

ఇళ్లలో పనిచేసే ఓ అమ్మాయిని తనకు ఎంతోకాలంగా తెలిసిన వ్యక్తి కపట సానుభూతి వ్యక్తం చేస్లూ.. స్కూ‍ల్లో ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి. తన మిత్రుడితో కలసి ఆ అమ్మాయిపై పాఠశాల ఆవరణలోనే సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం ఢిల్లీలో జరిగింది. ఇళ్లలో పనిమనిషిగా పనిచేసే ఓ యువతి (17)కి నిందితుల్లో ఒకరైన స్క్రాప్ డీలర్ ఏడాది నుంచి తెలుసు. అతడు ఆమెకు ఓ ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆ స్కూలులోకి తీసుకెళ్లాడు. స్కూలు సెక్యూరిటీ గార్డు అతడికి బాగా తెలిసున్నవాడు కావడంతో.. లోపలకు వెళ్లడానికి కూడా వాళ్లకు ఎలాంటి అడ్డు లేకపోయింది.

తాను ఓ టీచర్ను తీసుకొస్తానని, ఆయనే ఇంటర్వ్యూ చేస్తారని చెప్పి ఆఫీసు గది వద్ద ఉండాలని అతడు చెప్పాడు. పావుగంట తర్వాత సెక్యూరిటీ గార్డుతో తిరిగొచ్చి, గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారని ఆమె తెలిపింది. గట్టిగా అరిచేందుకు ప్రయత్నించగా వాళ్లు పారిపోయారు. తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ఆమె.. తన తల్లికి జరిగిన విషయం చెప్పింది. దాంతో ఇద్దరూ కలిసి జగత్పురి పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. యువతిని వైద్య పరీక్షలకు పంపి, ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gang rape  rape in school  job pretext  new delhi  Delhi school  Delhi Police  East Delhi  Jagatpuri  crime  

Other Articles