గుడి దొంగను పట్టించింది ఏంటో తెలుసా? theft caught by T shirt in temple robbery

Theft caught by t shirt in temple robbery

Sherawali temple robbery, theft caught by T shirt in temple robbery, temple robbery caught in CCTV, New Friends Colony temple, south Delhi temple robbery, గుడి దొంగను పట్టిచ్చింది ఏంటో తెలుసా?, టీ షర్ట్ సాయంతో దొంగను పట్టుకున్నారు, తెలుగు వార్తలు, తాజా వార్తలు, ఆలయంలో చోరీ, తెలుగు వార్తలు, national news

An employee of a well-known hotel in south Delhi has been arrested for stealing jewellery from a temple in New Friends Colony. The theft was caught in a CCTV camera installed at the temple.

గుడి దొంగను పట్టించింది ఏంటో తెలుసా?

Posted: 06/29/2016 10:16 AM IST
Theft caught by t shirt in temple robbery

గుడికి కన్నం వేసి నగలు దొంగతనం చేసిన ఓ కిలాడీని చాలా విచిత్రంగా పట్టుకున్నారు పోలీసులు. ఢిల్లీలోని షెరావలి టెంపుల్ లో ఈ నెల 23న చోరీ జరిగింది. అమ్మవారి కిరీటంతోపాటు నగ కూడా ఎత్తుకెళ్లిపోయారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగను భలేగా పట్టుకున్నారు.

ఆలయంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలించగా అందులో నిందితుడి మొహం సరిగ్గా కనిపించలేదు. కానీ, అతడు ధరించిన టీషర్ట్ మీద 52-జీఏఐఎన్ఐ అని రాసి ఉంది. ఇక అది పట్టుకున్న పోలీసులు సమీపంలో గాలింపులు చేపట్టారు. అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఓ గురుద్వారా వద్ద సరిగ్గా అలాంటి టీ షర్ట్ ధరించిన వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. ఆపై అతని కదలికలు అనుమానం రావటంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో మొత్తం నిజం కక్కేశాడు.

డార్జిలింగ్ కు చెందిన డేవిడ్ ప్రధాన్ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో వెయిటర్ గా పని చేస్తున్నాడు. ఈ నెల 23న ఆలయం వద్దకు వెళ్లిన అతను గర్భగుడిలో పూజారీ లేకపోవటంతో లోపలికి వెళ్లి తన చేతివాటం చూపాడు. కిరీటంతోపాటు, నెక్లెస్ తో ఉడాయించాడు. చివరకు పోలీసులు తైమూర్ నగర్‌లోని అతడి ఇంటి నుంచి ఆభరణాలను రికవరీ చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sherawali temple  robbery  theft caught  T shirt  

Other Articles