Venkaiah Naidu misses ‘important appointment’, fumes at Air India over flight delay

Air india delays flight makes venkaiah naidu furious

venkaiaha naidu, venkaiah naidu air india, air india venkaiah naidu, venkaiah naidu twitter, naidu air india flight, air india flight delay, air india news, india news

Venkaiah Naidu demanded an explanation from the government-run flight carrier, saying "transparency and accountability are the need of the hour".

వెంకయ్యకు తప్పని వ్యధ.. వృధా ప్రయాస..

Posted: 06/29/2016 08:21 AM IST
Air india delays flight makes venkaiah naidu furious

కేంద్రమంత్రి, అధికార పార్టీ సీనియర్ నేతకు తమ ప్రభుత్వ పాలనలో పనులు జరుగుతున్న తీరు తెలిసివచ్చింది. తమ ప్రభుత్వ పాలనలో అన్ని సవ్యంగా సాగుతున్నాయని ప్రకటనలు గుప్పించే నేతలకు తమ దాక వస్తే కాని విషయం అర్థం కాదని తెలిసిపోయింది. అయితే అప్పటికప్పుడు తమ అగ్రహాన్ని వెల్లగక్కినా.. మరో రెండు మూడు రోజుల్లో అది కాస్తా తెరమరుగవ్వడం.. మళ్లీ తమ ప్రభుత్వ తీరును ప్రశంసిస్తూ నేతలు వ్యాఖ్యాలు చేయడం సర్వసాధారణమే. ఇంతకీ ఆ కేంద్రమంత్రి ఎవరు..? ఏమిటా కథ కమామిషు అంటున్నారా..?

కేంద్ర మంత్రివర్గంలోని సీనియర్ మంత్రుల్లో సీనియర్ వెంకయ్యనాయుడు. ప్రధాని మోదీకి ఆప్తులు కూడా. ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన సమయాన్ని తగిన రీతిలో సద్వినియోగం చేసుకుంటారు. అలాంటిది ఓ అత్యవసర పని నిమిత్తం బయలుదేరిన ఆయనను ఎయిర్ ఇండియా తిప్పలుపెట్టింది. విమానం కోసం గంటంపావు సేపు ఎయిర్ పోర్టులో ఎదురు చూసిన ఆయన.. ఎంతకీ విమానం రాకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. విలువైన కాలాన్ని వృథా చేశారంటూ ఎయిర్ ఇండియా నిర్వహణా తీరుపై మండిపడ్డారు. వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పలు కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం వెంకయ్య మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఎయిర్ ఇండియా 544 విమానంలో ఆయనకు సీటు కూడా ఖరారయింది. మధ్యాహ్నం 1:15 గంటలకు విమానం బయలుదేరాల్సి ఉండగా, వెంకయ్య 12:20కే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. సరిగ్గా విమానం బయలుదేరాల్సిన కొద్ది నిమిషాల ముందు 'పైలట్ ఇంకా రాలేదని, మరి కొద్దిసేపు వేచిచూడాలని' అధికారులు ఆయనకు సమాచారం ఇచ్చారు.

అలా 1:45 వరకు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో వెంకయ్యనాయుడు తిరిగి తన ఇంటికి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఎయిర్ ఇండియా నిర్వాకాన్ని వివరిస్తూ వరుస ట్వీట్లు చేశారాయన. సర్వీసు ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని ఎయిర్ ఇండియాను డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పోటీకి అనుగుణంగా మారడంతోపాటు పారదర్శకత, జవాబుతారీతనం పెంపొందించుకోవాలని విమానయాన సంస్థకు హితవుపలికారు. విమానం ఆలస్యం కావడంవల్ల ఇంపార్టెంట్ అపాయింట్ మెంట్లు రద్దయ్యాయని చెప్పుకొచ్చారు. సాక్షాత్తు కేంద్ర మంత్రికే ఇలా జరిగితే.. విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఏం సమాధానం చెబుతారో చూడాలిమరి!
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union Minister Venkaiah Naidu  Air India  flight delay  

Other Articles