Haunting video reveals shock, horror at Istanbul airport

Attack at istanbul airport leaves at least 37 dead

terrorist attack, Istanbul airport, Turkey, ISIS, several dead, terror attack at istanbul airport, Three explosions hit Istanbuls Ataturk airport, Turkish international airport attacked, Ataturk Airport Istanbul, attack on istanbul airport, terror on Ataturk airport,

At least 36 people were killed and 147 injured when two explosions went off in Istanbul’s main international airport

ITEMVIDEOS: ఇస్తాంబుల్‌ విమానాశ్రయంపై ఉగ్రదాడి..

Posted: 06/29/2016 07:02 AM IST
Attack at istanbul airport leaves at least 37 dead

ఆసియా- యూరప్ ఖండాల వారధిగా పేరొందిన టర్కీలోని ఇస్తాంబుల్‌ విమానాశ్రయంలో ముష్కరులు మారణహోమం సృష్టించారు. దేశ రాజధాని, పర్యాటక కేంద్రమైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో కాల్పులు, ఆత్మాహుతి దాడులతో మరోసారి బీభత్సం సృష్టించారు. ఏక కాలంలో మూడు చోట్ల ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో సుమారు 37 మంది మృతి చెందగా, మరో 147 మందికి గాయాలయ్యాయి. అంతర్జాతీయ విమానాశ్రయ టర్మినల్ ను టార్గెట్ గా చేసుకుని ఆత్మాహుతి దాడులు జరిగాయి. అంతకుముందు తమ విమానాల కోసం ముందుగానే విమానాశ్రయానికి చేరిన ప్రయాణికులపై ఉగ్రవాదులు విఛక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు టర్కీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

భారీ ఆయుధాలతో ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్దకు చేరుకున్న ముగ్గురు ఉగ్రవాదు మొదట సెక్యూరిటీ గార్డులను కాల్చిచంపి లోపలికి ప్రవేశించారు. అప్పటికే అక్కడ విమానాల కోసం ఎదురుచూస్తోన్న వందల మంది ప్రయాణికులపై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత తమను తాము పేల్చుకున్నారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న టెర్మినల్ వాతావరణం పేలుళ్లలో ఒక్కసారిగా మారిపోయింది. ఏరులైపారిన రక్తం, బుల్లెట్లు, ప్రయాణికుల హాహాకారాలతో భీతావాహంగా మారిపోయింది. ఆత్మాహుతికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయినట్లు తెలిసింది. కాగా, దాడులకు పాల్పడింది ఐఎస్ అనుబంధ దేశీయ సంస్థే అయి ఉండొచ్చని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.

ప్రపంచంలో అత్యంత రద్దీ పర్యాటక నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులను ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డొగాన్ ఖండించారు. దాడి సమాచారం తెలియగానే ప్రధానమంత్రి బినాలి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన తైపీ.. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలు టర్కీకి సహకరించాల్సిందిగా కోరారు. విదేశీ టూరిస్టులే లక్ష్యంగా ఇటీవల టర్కీలో మరీ ప్రధానంగా ఇస్తాంబుల్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో గత డిసెంబర్ లో  జరిగిన పేలుడులో ఇద్దరికి గాయాలైన సంగతి తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terrorist attack  Istanbul airport  Turkey  ISIS  37 dead  

Other Articles