Dalit girl bobbitises man during rape attempt

Dalit girl in up castrates man attempting rape

Dalit girl bobbitises man during rape attempt, Dalit girl, bobbitises, rape attempt, Meerut, private parts, girl chops off rapist private parts, dalit girl rape attempt, meerut dalit girl, rape attempt, Meerut, private parts, rape, uttar pradesh, crime

A 17-year-old Dalit girl bobbitised a man who allegedly attempted to rape her at knifepoint.

మైనర్ బాలిక ధైర్యం.. రేపిస్టుకు తగిన శాస్తి..

Posted: 06/25/2016 10:19 AM IST
Dalit girl in up castrates man attempting rape

కత్తితో బెదిరించి అత్యాచారం చేయబోయిన ఒక మగమృగానికి తగిన శాస్తి చేసింది ఓ దళిత మైనర్ బాలిక. అదెలా అంటారా..? పీకలపై కత్తి పెట్టి అత్యాచారానికి యత్నించిన రేపిస్టు చేతిలోంచి తన బలానంతా ఉపయోగించిన కత్తిని లాకున్న బాలిక.. అతని మర్మాంగాలను కోసేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. మదంతో పైశాచిక మృగం తనపై బడి అత్యాచారం చేయడానికి యత్నించడంతో బాలిక తప్పించుకునేందుకు మాత్రమే అలా దాడి చేయాల్సిరావడంతో అమె ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఇంచోలి ప్రాంతంలో ఉన్న అడవిలోకి పదిహేడేళ్ల దళిత బాలిక ఇంటికి వెళ్తుంది. దీనిని గమనించిన రాయిస్ అనే యువకుడు ఆమెను వెంబడించాడు. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే బాలిక మార్గంమధ్యంలో అమెను నిలిపి అత్యాచారానికి యత్నించాడు. తన వద్ద ఉన్న కత్తితో ఆ బాలికను బెదిరించి లొంగదీసుకోవాలని చూశాడు. యువకుడి చేతిలో కత్తిని చూసి ముందుగా షాక్ కు గురైన బాలిక కొంత అందోళనకు గురైంది.

ఆ తరువాత తేరుకున్న బాలిక, రేపిస్టును తీవ్రంగా ప్రతిఘటించిన ఆ బాలిక తన శక్తినంతా కూడగట్టుకుని అతని చేతిలోని కత్తిని లాక్కుంది. మెరుపు వేగంతో అతని మర్మాంగాలను కోసి పారేసి అక్కడి నుంచి బయటపడింది. దీంతో, రాయిస్ అరుపులు కేకలు పెట్టడంతో సమీపంలో ఉన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమాచారం పోలీసులకు తెలియజేయడంతో నిందితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : meerut  Dalit girl  bobbitises  rape attempt  Meerut  private parts  rape  uttar pradesh  crime  

Other Articles