నీతి ఆయోగ్ షాకింగ్ నిర్ణయం! | niti aayog panel to central Scrap railway budget

Niti aayog panel to central scrap railway budget

niti aayog suggests central to scrap railway budget. railway budget is no more, Dispensing with the Rail Budget, రైల్వే బడ్జెట్ కి చరమగీతం, నీతి ఆయోగ్ షాకింగ్ నిర్ణయం, రైల్వే బడ్జెట్ ను లేపేస్తున్నారు, తాజా వార్తలు, తెలుగు వార్తలు, జాతీయ వార్తలు, బడ్జెట్ వార్తలు, latest news, national news, taajavarthalu, telugu news

niti aayog panel to central Scrap railway budget. The NDA government has sought the Railway Ministry’s comments on a 20-page note sent by NITI Aayog to the Prime Minister’s Office (PMO), arguing in favour of doing away with the high-profile annual exercise. The note, titled “Dispensing with the Rail Budget” and jointly authored by Aayog member and economist Bibek Debroy and Kishore Desai, Officer on Special Duty, argues that the exercise had failed to be of use to the sector and become a “mechanism to announce popular measures”.

నీతి ఆయోగ్ షాకింగ్ నిర్ణయం!

Posted: 06/22/2016 11:24 AM IST
Niti aayog panel to central scrap railway budget

రైల్వే బడ్జెట్ కనుమరుగు కాబోతుందా?. ఈ యేడాది పిబ్రవరిలో మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిందే చివరిదా?. అవుననంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ పాలనలో సంస్కరణలకు తెర తీయబోతుంది. కీలక విభాగంగా ఉన్న ప్రణాళికా సంఘానికి చెల్లు చీటి ఇచ్చి, దాని స్థానే ‘నీతి ఆయోగ్’ను ఏర్పాటు చేసింది. అయితే పాలనపైనే కాకుండా... సంస్కరణలపైనా దృష్టి సారించిన నీతి ఆయోగ్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్రానికి నివేదికను అందజేసింది.

నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను కేంద్రం అమలు చేసేందుకు నిర్ణయిస్తే మాత్రం ఇకపై మనం రైల్వే బడ్జెట్ ను చూడలేం. ఇప్పుడు మనం చూస్తున్న రైల్వే బడ్జెట్ బ్రిటిష్ పాలకుల కాలం నుంచి ఉంది. అయితే వారి నుంచి సంక్రమించిన రైల్వే బడ్జెట్ మనకెందుకంటూ ఆ నివేదిక ప్రభుత్వానికి సూచించిందట. దీంతో రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేసే దిశగా చర్యలు చేపట్టాలని మోదీ సర్కారు ఆదేశించినట్లు తెలుస్తోంది.

దీనిపై కూలంకశంగా అధ్యయనం చేసిన దేబ్రాయ్ కమిటీ పలు సూచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా రైల్వే బడ్జెట్ కు చెల్లు చీటి ఇవ్వడమే మంచిదని కూడా ఆ నివేదిక ప్రభుత్వానికి సిఫారసు చేసిందట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది నుంచి సాదారణ బడ్జెట్ లోనే రైల్వే కేటాయింపులను చూస్తామన్న మాట.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : niti aayog  scrap railway budget  Modi govt  

Other Articles