పోలీస్ కాల్పుల్లో ఆరుగురు టీచర్ల మృతి | six teachers died in Mexico police fire

Six teachers died in mexico police fire

Violent clashes between police and unionized teachers, Mexico police and unionized teachers clash, controversial education reforms in Mexico, మెక్సికోలో పోలీసులకు, టీచర్లకు మధ్య ఘర్షణ, టీచర్లపై కాల్పులు, ఆరుగురు టీచర్ల మృతి, తాజా వార్తలు, అంతర్జాతీయ వార్తలు, international news, latest news, telugu news

Violent clashes between police and unionized teachers in Mexico have left six dead and hundreds injured. A radical teachers union is leading the protests, which were sparked by controversial education reforms.

పోలీస్ కాల్పుల్లో ఆరుగురు టీచర్ల మృతి

Posted: 06/20/2016 01:22 PM IST
Six teachers died in mexico police fire

తమ సమస్యలు పరిష్కారించాలంటూ రోడెక్కి ఉద్యమిస్తున్న ఉపాధ్యాయులపై పోలీస్ తుటా పేలింది. శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలో పోలీసుల అతిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆరుగురు ఉపాధ్యాయులు అక్కడిక్కడే మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. దీంతో ప్రస్తుతం మెక్సికో అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విద్యారంగంలోని సంస్కరణలను వ్యతిరేకిస్తూ గత కొద్దికాలంగా ఆ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆదివారం ఒయాక్సాకా-ప్యూబ్లా మధ్య రహదారి దిగ్భందించి నిరసన తెలుపుదామని ఉపాధ్యాయులంతా మానవహారంగా ఏర్పడ్డారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారిపై లాఠీ చార్జీ చేశారు. ఆగ్రహించిన ఉపాధ్యాయుల వారి వాహనాలకు నిప్పుపెట్టగా, పోలీసులు కాల్పులకు దిగారు. కాల్పుల్లో 6 మంది అక్కడిక్కడే చనిపోగా, 100 మందికి గాయాలయ్యాయి. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శాంతియుతంగా నిర్వహిస్తున్న ఆందోళనలో కవ్వింపు చర్యలకు పాల్పడటమే కాకుండా ప్రాణాలు బలి తీసుకున్నారని ఉపాద్యాయ సంఘ నేతలు ఆరోపిస్తున్నారు.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mexico police fire  unionized teachers  clash in mexico  

Other Articles