మొగుడితో కలిసి చెండాలమైన పనులు | wife helps husband to forcing a girl for prostitution

Wife helps husband to forcing a girl for prostitution

wife helps husband to balckmail a girl for sex, wife helps husband to balckmail a girl forcing prostitution, మొగుడితో కలిసి బ్లాక్ మెయిలింగ్, పాడు పనులకు సహకరించింది, పాడు పనులకు మొగుడితో కలిసి, మొగుడితో కలిసి యువతిపై దారుణం, యువతి జీవితం, వ్యభిచారంలోకి యువతి, యువతిని భర్తతో కలిసి, తెలుగు వార్తలు, స్థానిక వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, తాజావార్తలు

wife helps husband to balckmail a girl for sex, And forced for prostitution in west godavari.

మొగుడితో కలిసి చెండాలమైన పనులు

Posted: 06/18/2016 11:34 AM IST
Wife helps husband to forcing a girl for prostitution

భార్య భర్తలో సగం అంటారు. అలాంటిది మొగుడు చేసే పాడుపనిలోనూ ఆమె భాగస్వామిగా మారింది. ఓ యువతితో భర్త  అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా  చిత్రీకరించడమే కాదు, సాటి ఆడది అయి ఉండి వ్యభిచార కూపంలోకి దించి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించింది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో వెలుగు చూసిన ఘటన వివరాళ్లోకి వెళ్లితే...

కొత్తూరు గ్రామానికి చెందిన నెక్కంటి శ్రీను, సుశీల భార్యభర్తలు. గత కొద్దికాలంగా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ యువతి(19)పై శీనుకి కన్నుపడింది. తన కామ కోరికను భార్యకు చెప్పగా అందుకు ఆమె హ్యాపీగా అంగీకరించాడు. తొలుత సుశీల యువతితో స్నేహం పెంచుకుంది. ఆపై చనువు ఎక్కువకావటంతో తరచూ ఆ యువతి శ్రీను ఇంటికి వచ్చి వెళ్తుండేది.

ఈ క్రమంలో ఓ రోజు ఇంటికి వచ్చిన యువతికి మత్తు మందు కలిపి ఇచ్చారు. ఆపై స్పృహ కోల్పోయిన యువతిపై భర్త అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదంతా భార్యే దగ్గరుండి సెల్ ఫోన్ లో చిత్రీకరించింది. ఇక అప్పటి నుంచి తన శరీర వాంఛ తీర్చుకునేందుకు యువతిని బ్లాక్ మెయిల్ చేయసాగాడు. అంతేకాదు చివరకు వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేయసాగాడు. దైర్యం చేసిన యువతి పోలీసులకు ఫిర్యాదుచేయగా ఆ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చేసిన చెండాలమైన పనికి మొగుడితోపాటే చెరసాలను సైతం పంచుకుంటుందా మహిళ.



బాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wife helps husband  balckmail girl for sex  girl forcing prostitution  

Other Articles