రెజ్లర్ పై ఆడ మాజీ పోలీస్ పిడిగుద్దులు | professional woman wrestler knocked down kavitha

Professional woman wrestler knocked down kavitha

India's first woman wrestler, BB Bull Bull, BB Bull Bull knock down by kavitha, haryana ex police beat wrestler, ‪Kavita Bull Bull fight, కవిత బుల్ బుల్ ఫైట్, రెజ్లర్ ను మట్టి కరిపించిన ఆడ మాజీ పోలీస్, తెలుగు వార్తలు, తాజా వార్తలు, ఐటెం వార్తలు, latest news, telugu news

BB Bull Bull, who is the first professional woman wrestler from India was knocked down by former ‪‎Haryana‬ police officer, power-lifting and ‪‎MMA‬ champion ‪Kavita during a duel at the hub of Continental Wrestling Entertainment (CWE) in Jalandhar (Punjab).

ITEMVIDEOS: రెజ్లర్ పై ఆడ మాజీ పోలీస్ పిడిగుద్దులు

Posted: 06/18/2016 10:33 AM IST
Professional woman wrestler knocked down kavitha

ఆమె ఏం ఫ్రోఫెషనల్ రెజ్లర్ కాదు. ఏదో సరదా రెజ్లింగ్ పోటీలను చూద్దామని వచ్చింది. కానీ, రింగ్ నుంచి సవాళ్ విసురుతుంటే చూస్తు ఉండలేకపోయింది. అంతే ఒంటి మీద పంజాబ్ డ్రెస్ ఉన్నా సరే చంగున బరిలోకి దూకింది. తనను తోసేయటంతో ఉవ్వెతున ఆమె పై లఘించింది. అంతే ఒక దెబ్బతో ఆ రెజ్లర్ ను మట్టికరిపించింది. అయినా బుద్ధితెచ్చుకోకుండా రెండోసారి సవాల్ విసరడంతో మరో రెండోసారి పంజా విసిరింది. రెండోసారి అదే రిపీట్ అయ్యింది. ఢిల్లీలో ప్రముఖ రెజ్లర్ గ్రేట్ కాళీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ పోటీల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

భారత ప్రప్రథమ మహిళా రెజ్లర్ బీబీ బుల్ బుల్ పోటీలో భాగంగా తనకు ఎదురే లేదని సవాల్ విసిరింది. అయితే అక్కడే ఉన్న కవితకు మండిపోయింది. కవిత గతంలో హర్యానా పోలీస్ శాఖలో పనిచేసి రాజీనామా చేశారు. కానీ, ఫ్రోఫెషనల్ రెజ్లర్ ఏం కాదు. అయితేనేం ముందు వెనకా ఆలోచించకుండా దూకేసింది. రియర్ రెజ్లర్ మాదిరి సింగిల్ దెబ్బకు బుల్ బుల్ ని మట్టి కరిపించింది.  దీంతో షాక్ తిన్న నిర్వాహకులు నలుగురు యువకులను రింగ్ లోకి పంపి కవితను నిలువరించారు.

అయితే బుల్ బుల్ కి మాత్రం సరదా తీరదేలేదేమో మరోసారి ఆమెకు సవాల్ విసిరింది. రెండో దఫా కూడా కవిత తన పంచ్ పవర్ చూపించారు. రెండో మారు కూడా మొదటి పంచ్ తరహాలోనే కవిత విరుచుకుపడటంతో బుల్ బుల్ కిందపడిపోయింది. ఆ తర్వాత కూడా కవితను నిలువరించడం నిర్వాహకులకు సాధ్యం కాలేదు. ఎలాగోలా కష్టపడి ఇద్దరు యువకులు కవితను నిలువరించి కిందకు పంపారు. గతంలో కవితకు మార్షల్ ఆర్ట్ లో కాస్త ప్రావీణ్యం ఉందట. అది ఇప్పుడు ఉపయోగపడిందని ఆమె చెబుతున్నారు. అదంతా ఎంటర్ టైన్ మెంట్ లో భాగమే అని తెలిసినప్పటికీ ప్రస్తుతానికి మాత్రం జాతీయ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BB Bull Bull  India's first woman wrestler  haryana ex-police beat wrestler  

Other Articles

Today on Telugu Wishesh