మన భూభాగంలో పాక్, ఐఎస్ జెండాలు! | ISIS and Pak flags in srinagar Separatists rally

Isis and pak flags in srinagar separatists rally

ISIS and Pak flags in jammu, chaos in srinagar, Separatists rally in srinagar, శ్రీనగర్ లో పాక్, ఐఎస్ జెండాలు, శ్రీనగర్ లో పాక్ జెండాలు, latest news, తెలుగు వార్తలు, తాజా వార్తలు. జమ్ము వార్తలు, శ్రీనగర్ అల్లర్లు, జమ్ము వేర్పాటు వాదులు

chaos in jammu capital srinagar. ISIS and Pak flags in srinagar Separatists rally.

మన భూభాగంలో పాక్, ఐఎస్ జెండాలు!

Posted: 06/17/2016 06:27 PM IST
Isis and pak flags in srinagar separatists rally

జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్ మరోసారి రణరంగంగా మారింది. ఆర్మీ కాలనీ నిర్మాణానికి వ్యతిరేకంగా యాసిన్ మాలిక్ ఆధ్వర్యంలోని వేర్పాటు వాదులు ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు భారత్ పై వ్యతిరేకతను ప్రదర్శిస్తూ పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేస్తూ, ఆ దేశ జెండా, ఐఎస్ఐఎస్ జెండాలు ప్రదర్శిస్తున్నారు.

ఆర్మీ కాలనీ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, సైనికులకు ప్రత్యేక కాలనీలు కట్టించాలని అక్కడి ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. తద్వారా సాధారణ ప్రజానీకం నుంచి ఉద్యోగులను వేరు చేసి నిరంతర నిఘాలో ఉంచనుంది. దీంతో ఒక వర్గం వేరైపోతే, ఉద్యోగులకు సంక్షేమ ఫలాలు అందుతాయని, అలా జరగడం ద్వారా సాధారణ ప్రజానీకాన్ని సంక్షేమాన్ని సులువుగా చూసుకోవచ్చని ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా  వేర్పాటు వాదులు, తిరుగుబాటుదారులు, తీవ్రవాదులను ఏరివేయడం సులభమని ఆలోచన చేసింది.

అయితే ఇలా జరిగితే ప్రజలపై తమ పట్టు సడలిపోతుందని భావించిన వేర్పాటు వాదులు ప్రజల్లో విద్వేషాలు రేచగొడుతున్నట్లు తెలుస్తోంది. అసలు కాలనీలు అవసరం లేదంటూ స్థానిక ప్రజలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటుచేసుకోగా వారు పోలీసుల, ఆర్మీ పైకి రాళ్లు రువ్వారు. పరిస్థితి చేజారిపోవటంతో పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో ప్రస్తుతం శ్రీనగర్ అంతా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS and Pak flags  srinagar  Separatists rally  jammu and kashmir  

Other Articles