తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల | Telangana TET result 2016 declared

Telangana tet result 2016 declared

Telangana TET, Telangana TET results, Telangana TET 2016, తెలంగాణ టెట్ ఫలితాలు, టెట్ 2016, తెలంగాణ టెట్, టెట్ ఫలితాలు, తాజా వార్తలు, తెలంగాణ వార్తలు, latest news, telugu news

Telangana TET result 2016 announced.

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

Posted: 06/17/2016 11:52 AM IST
Telangana tet result 2016 declared

తెలంగాణ రాష్ట్ర టీచర్ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు కాసేపటి క్రితం విడుదల అయ్యాయి. గత నెల 22న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కిషన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. మొత్తం రెండు పేపర్లకు కలిపి 3,73,494 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 3,40,082 మంది (90.55 శాతం) హాజరయ్యారు.

పేపర్-1పరీక్షకు 1,01,213 మంది దరఖాస్తు చేసుకోగా, 88,158 మంది (87.10 శాతం) హాజరయ్యారు. 55.45 శాతం ఉత్తీర్ణులయ్యారు. కాగా,  పేపర్-2 పరీక్షకు 2,74,339 మందికి గాను 2,51,924 మంది(91.83 శాతం) హాజరయ్యారు. 24.05 శాతం ఉత్తీర్ణులయ్యారు. పేపర్ -1లో 134 మార్కులతో స్నేహలత(మెదక్ జిల్లా) మొదటి స్థానంలో నిలవగా, పేపర్ -2లో 126 మార్కులతో డి. శారదావాణి(కరీంనగర్ జిల్లా) ప్రథమ స్థానంలో నిలిచింది. www.tstet.cgg.gov.in సైట్ ను సంప్రదించి ఫలితాలు తెలుసుకోవచ్చు.

బాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana TET  TET-2016 results  Telangana TET-2016  

Other Articles