నారాయణా! మరీ ఇంత నోటి దూలా? | CPI narayana fires on telugu CMs and governor

Cpi narayana fires on telugu cms and governor

CPI narayana, narayana fires on telugu CMs, narayana fires on pawan kalyan, narayana fires on telugu governor, నారాయణ పవన్ కళ్యాణ్, నారాయణ గవర్నర్ నరసింహన్, నారాయణ కేసీఆర్ చంద్రబాబు, నారాయణ నోటి దూల, సీపీఐ నారాయణ అడ్డగోలు వ్యాఖ్యలు, నారాయణ ఆరోపణలు, తెలుగు వార్తలు, తెలంగాణ వార్తలు, తాజా వార్తలు, CPI narayana news, latest news, telugu news

CPI narayana fires on telugu CMs and governor. Alleges pawan kalyan cheated kapus. Suggested TRS leaders to Don't blame prof kodandaram.

నారాయణా! మరీ ఇంత నోటి దూలా?

Posted: 06/11/2016 04:07 PM IST
Cpi narayana fires on telugu cms and governor

విమర్శలలో పదునైన పదాలను వాడే సీపీఐ నేత నారాయణ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. శనివారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి తెలుగు రాష్ట్రాల సీఎంలపై విరుచుకుపడ్డాడు. గవర్నర్, ఇరు రాష్ట్రాల సీఎంలను, ఆఖరికి నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోసహా ఎవరినీ వదలకుండా అందరినీ ఏకీపడేశాడు. ఈ క్రమంలో అందరిపైన కాస్త ఘాటైన పదజాలాన్నే ఆయన వాడారు.

ఇద్దరు చంద్రులు పాలన మానేసి రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇతర పార్టీ నేతలను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప, పాలనపై ఏ మాత్రం దృష్టిసారించడం లేదంటూ మండిపడ్డారు. వారి మాటలు విని పార్టీ మారుతున్నవారంతా బడుద్ధాయిలంటూ సీరియస్ అయ్యారు.  ముఖ్యమంత్రులిద్దరూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు.  కొత్త నిర్మాణాల పేరుతో కేసీఆర్, అమరావతి పేరుతో చంద్రబాబు వ్యాపారం మొదలెట్టేశారన్నారు.

ఇక గవర్నర్ గురించి కాస్త పరుషమైన పదజాలాన్నే వాడారు. ఇద్దరు సీఎం గొడవలు పడుతుంటే దారిన పెట్టాల్సిన గవర్నరు ఆపని చేయలేకపోతున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులుంటే గవర్నర్ గారు వంకాయలు తరుగుతున్నారా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చేష్టలుడిగి చూస్తుడటం తప్ప గవర్నర్ పొడిచేదేం లేదంటూ మండిపడ్డారు.

నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కూడా విమర్శలు గుప్పించారు. ఎప్పుడో ఓ సారి మీడియా ముందుకు వ‌చ్చి ప‌వ‌న్ నీతులు చెబుతున్నారని, అవి విన‌డానికి ప్రజలు సిద్ధంగా లేర‌ని వ్యాఖ్యానించారు. ముద్రగడ దీక్ష, అరెస్ట్ లాంటి వాటితో రాష్ట్రం రావణకాష్టంలా మండుతుంటే, కాపులకు అండగా ఉంటానన్న ప‌వ‌న్ ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడంటూ ప్రశ్నించాడు. హీరోగా వచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ చివరకు రాజ‌కీయాల్లో జోక‌ర్‌గా మిగిలిపోతాడని ఎద్దేవా చేశాడు.

చివర్లో ఉద్యమకాలంలో కోదండరాంను వాడుకున్న టీఆర్ఎస్ ఇప్పడు విమర్శించడం సరైందని కాదని చెప్పారు. పాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలను విశ్లేషించి ముందుకెళ్లాలే తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దని టీఆర్ఎస్ నేతలను హెచ్చరించాడు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CPI narayana  governor narasimhan  narayana telugu CMs  narayana pawan kalyan  

Other Articles