Nandamuri balakrishna 56th birthday special

Nandamuri balakrishna 56th birthday special

Nandamuri balakrishna 56th birthday special, Nandamuri balakrishna birthday, NTR son balayya, balayya 56th birthday special, బాలయ్య బర్త్ డే స్పెషల్, బాలయ్య 56వ పుట్టిన రోజు, latest news, special stories, special balayya

నందమూరి నటసింహ, యువరత్న బాలయ్య | Nandamuri balakrishna 56th birthday special

ITEMVIDEOS: నందమూరి నటసింహ, యువరత్న బాలయ్య

Posted: 06/10/2016 10:19 AM IST
Nandamuri balakrishna 56th birthday special

నటరత్న నందమూరి ఎన్టీఆర్ నటవారసుడిగా ఆరంగ్రేటం చేసి తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు నటసింహ బాలకృష్ణ. ఏకధాటిగా నాలుగు దశాబ్దాలుగా విరామం లేకుండా నటిస్తున్న ఒకేఒక హీరోగా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. పౌరాణికం, చారిత్రకం, సాంఘిక ఇలా ఎలాంటి చిత్రాల్లోనైనా నవరసాలు పండించడంలో బాలయ్య తండ్రికి తగ్గ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు ఉత్తరాదిలోనే కాదు, ఇటు దక్షిణాదిలోనే ఏ హీరో 40 సంవత్సరాలు నాన్ స్టాప్ గా హీరోగా కొనసాగిన రికార్డు లేదంటే అతిశయోక్తి కాదు. శుక్రవారం (జూన్ 10) ఆయన 56వ పుట్టిన రోజు ఈ సందర్భంగా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గురించి ప్రత్యేకం.

- నటవారసుడిగా ఇండియాలో ఆయన నెలకొల్పిన రికార్డు ప్ర్యతేకం. సమీపంలో కూడా ఏ హీరో దాన్ని చెదరగొడతాడన్న గ్యారెంటీ లేదు.
- పువ్వు పుట్టగానే పరిమళించినట్లు బాల్యం నుంచే స్కూల్లో నాటకాల్లో రాణించారు.
- 1974లో తండ్రి దర్శకత్వంలో వచ్చిన తాతామ్మ కలతో తెరంగ్రేటం చేశాడు. ఇక అక్కడి నుంచి ఎక్కడా గ్యాప్ లేకుండా నటిస్తూనే ఉన్నారు.
- సోలో హీరోకాకముందే తండ్రిచాటు బిడ్డ నటనలో వైవిధ్యం ప్రదర్శించారు. ఆరంభంలోనే సాంఘిక, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో నటించి మురిపించారు.
- కీలకమైన అభిమన్యుడి పాత్రలో ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ లో అలరించాడు. వేములవాడ భీమకవి, అక్బర్ సలీం అనార్కాలీ చిత్రాల్లో ఆయన నటించాడు.
- సోలో హీరోగా 1984 లో సాహసమే నా ఊపిరి చిత్రంతో ఆరంగ్రేటం చేశారు. ఒక సీఎం కొడుకు అయి ఉండి కూడా సాదాసీదాగా అరంగ్రేటం చేశారు.
- వరుసగా మూడు అపజయాలు రావటంతో పలు విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ వారసుడిగా పనికి రాడంటూ పెదవి విరిచాయి. కానీ, నాలుగో చిత్రం మంగమ్మమగారిమనవడుతో రికార్డులు బద్ధలు కొట్టాడు
- 1986లో వచ్చిన ముద్దుల కృష్ణయ్యతో కోటి రూపాయల మార్క్ అందుకున్న తొలి చిత్రంగా రికార్డు సృష్టించారు.
- అదే యేడూ ఆయన సాధించిన మరో రికార్డు మరో హీరోకి సాధ్యం కాదేమో. ఆరు విజయాలు ఆయన ఆ సంవత్సరం సాధించారు.  
- ఆడపచుల అన్నయ్యగా ఎన్టీఆర్ ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ, బాలయ్య చేసిన పాత్రలు ప్ర్యతేకంగా గుర్తిండిపోయాయి.
- ప్రయోగాలు చేసేందుకు అగ్రహీరోలు భయపడుతున్న సమయంలో ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి చిత్రాలు తీసి హిట్లు కొట్టి ఆశ్చర్యపరిచారు. 100 శాతం మాస్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే నారీ    నడుమ మురారీ వంటి ఎంటైర్ టైన్ మెంట్ చిత్రాన్ని అందించి ఆకట్టుకున్నారు.  
- 1993లో బాలయ్య చేసిన ప్రయోగం బహుశా సినిమా చరిత్రలో ఎవరూ చేయరేమో. ఆ ఏడాది ఆయన చేసిన  రెండు సినిమాలను ఒకేరోజు రిలీజ్ చేశారు. అవే నిప్పురవ్వ, బంగారు బుల్లోడు. రెండూ 100 డేస్      ఆడాయి.  
- ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు ఫలించాయి, మరికొన్ని వికటించాయి. అయినా అదంతా ధైవాదీనం అంటూ బెదరకుండా ముందుకు సాగిపోయాడాయన.
- మూస ధోరణిలో పోతున్న తెలుగు చిత్రాలకు సమరసింహారెడ్డితో వేడిని వాడిని అందించారు. అదే ఊపులో నరసింహానాయుడు తీసి పాతిక కోట్ల చిత్రాన్ని అందించడంతోపాటు తొలి నంది అవార్డు  అందుకున్నారు. ఆ చిత్రం వందరోజులు, వంద సెంటర్లలో ఆడింది.
- ఇతరులు సృష్టించిన బాణీలో ఆయన ఏనాడూ నడవలేదు. ఫ్యాక్షన్ చిత్రాలతో ఓ ట్రెండ్ సెట్ చేశారు.
- సింహం అనే టైటిల్ ఆయనకు బాగా కలిసొచ్చింది.
- వందో చిత్రంగా ఆయన చేసుకున్న ఎంపిక అభినందనీయం. తెలుగు రాజ్యాన్ని పాలించిన రాజు, చారిత్రక యోధుడు గౌతమీ పుత్రశాతకర్ణీ జీవిత చరిత్రపై తీస్తున్న చిత్రంలో ఆయన నటిస్తున్నాడు.  క్రిష్ దర్శకత్వంలో ప్రస్తుతం గౌతమీ పుత్రశాతకర్ణి  చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  

ఈ తరం హీరోలతో సైతం పోటీపడగలనని నిరూపించుకుని, ముందుకెళ్తున్నాడు ఈ నందమూరి హీరో. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని తెలుగువిశేష్ తరపున మనసారా కోరుకుంటున్నాం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles