జగన్ హీరోనా? విలనా? | jagan warns AP police in bharosa yatra

Jagan warns ap police in bharosa yatra

YS Jagan, raithu bharosa yatra, jagan as hero, babu as villian, ananthapur bharosa yatra. AP news, political news, తాజా వార్తలు, ఏపీ రాజకీయాలు, తెలుగు వార్తలు, latest news, telugu news

jagan describe himself as hero and babu as villian. warns AP police in ananthapur bharosa yatra.

జగన్ హీరోనా? విలనా?

Posted: 06/06/2016 09:39 AM IST
Jagan warns ap police in bharosa yatra

ఒక్క అనంతపురంలోనే కాదు ఏపీ రాష్ట్రం మొత్తం మీద జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఉద్రికత్తలు రేపింది. పరుషపదజాలంతో సీఎం చంద్రబాబును దూషించడంతో ఎలాగైనా అడ్డుకుని తీరాలని అధికార పక్షం తీవ్ర ప్రయత్నం చేసింది. అయినా తీవ్ర నిరసనల, ఆందోళనల నడుమ ఎట్టకేలకు యాత్ర పూర్తయ్యింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చివరిరోజు కూడా కొనసాగాయి. చివరి రోజు ఓబుళదేవరచెరువు మండలం వడ్డివారిపల్లెలో జగన్ ఆవేశపూరిత ప్రసంగంతో ముగిసింది. ఈ సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో జగన్ ఓ ఆసక్తికర చెప్పాడు.

ప్రస్తుత రాజకీయాలను ఉటంకిస్తూ తనను తాను హీరోగా అభివర్ణించుకుంటూ దాన్ని చెప్పుకోసాగాడు.  ‘‘13 రీళ్లలో విలన్ దే పై చేయిగా ఉటుంది. హీరో మాత్రం అమాయకుడు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. 14వ రీలులో కథ క్లైమాక్స్ కు చేరుకుంటుంది. అప్పుడే కథ అడ్డం తిరుగుతుంది. ఆఖరి నిమిషంలో విలన్ జైలుకు పోతాడు. చివరకు కష్టాలన్నీ అధిగమించి ప్రజల మన్నన పొంది హీరో రాజవుతాడు’’ అంటూ చెప్పుకోసాగాడు. చంద్రబాబు, తన పాత్రలను పరోక్షంగా పేర్కొంటూ జగన్ చెప్పిన సదరు సినిమా కథకు వైసీపీ కార్యకర్తల నుంచి మంచి స్పందనే వచ్చింది. అయితే అంతదాకా బాగానే ఉన్నప్పటికీ చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చాడు.

హీరోగా చెప్పుకుంటూనే ఉన్నట్టుండి విలన్ లా మారిపోయాడు. అధికార పార్టీ టీడీపీకి వత్తాసు పలుకుతున్న పోలీసులు తమ పార్టీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించిన జగన్... ప్రభుత్వాలు మారుతుంటాయన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించాడు. ప్రభుత్వమే పట్టపగలు ఖూనీలు చేసే స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, రాప్తాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జీ ప్రకాశ్ రెడ్డిని చంపాలని చూశారంటూ ఆరోపించారు. చంద్రబాబు పాలన ఎల్లకాలం ఉండదు, పోలీసులు మానవతా దృక్పథంతో పనిచేసి న్యాయాన్ని కాపాడాలన్నారు. ‘‘ప్రభుత్వాలు మారుతుంటాయి. మేమూ అదికారంలోకి వస్తాం. చూస్కోండి. జీతాలిస్తున్నది చంద్రబాబు కాదు. ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి’’ అంటూ సాలిడ్ వార్నింగ్ ఇచ్చాడు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  raithu bharosa yatra  jagan as hero  babu as villian  ananthapur bharosa yatra  

Other Articles