భారత్ లో యాపిల్ ఆశలకి దెబ్బ | Indian govt says no to Apple refurbished iPhones

Indian govt says no to apple refurbished iphones

Apple, refurbished iPhones, apple stores in india, tim cook, India, make in india, తాజా వార్తలు, యాపిల్, భారత్ లో యాపిల్ స్టోర్స్, టిమ్ కుక్, మేకింగ్ ఇండియా, తాజా వార్తలు, తెలుగువార్తలు, latest news, telugu news

Apple won’t be able to open retail stores straight away, and now, India has rejected its plan to sell low-cost refurbished iPhones.

భారత్ లో యాపిల్ ఆశలకి దెబ్బ

Posted: 06/04/2016 05:14 PM IST
Indian govt says no to apple refurbished iphones

పాత ఫోన్లను ఇండియాకు దిగుమతి చేసి లాభపడటంతోపాటు, మోదీ కలల ప్రాజెక్టు మేకింగ్ ఇండియాకు దెబ్బ వేద్దామనుకున్న దిగ్గజ సంస్థ యాపిల్ కు రివర్స్ పంచ్ పడింది. భారత్ లో రిటైలర్ స్టోర్ ఏర్పాటు చేసుకుందామనుకున్న ఆ కంపెనీకి కేంద్రం మొండిచేయి చూపించింది. అనుమతులు నిరాకరిస్తూ యాపిల్ పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించిందట. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ ప్రముఖంగా ప్రచురించింది.

తాజాగా భారత్ పర్యటనకు వచ్చిన సీఈవో టిమ్ కుక్ ఇక్కడి పరిస్థితులను, స్మార్ట్ ఫోన్లకు గల క్రేజ్ కళ్లారా చూసి ఈ ఆలోచనకు కార్యరూపం దాల్చాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా స్వదేశానికి వెళ్లగానే నిపుణులతో చర్చించి ఈ ప్రతిపాదనను భారత్ ముందు ఉంచాడు. ఉద్యోగవకాశాలు లభించడటంతోపాటు, పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందని భావించిన కేంద్రం ముందుగా ఓకే చెప్పినప్పటికీ ఆ తర్వాత మనసు మార్చుకుంది.

పాత ఫోన్లను దిగుమతి చేసుకుని వినియోగించుకోవాలంటే ప్రత్యేకంగా రిటైల్ స్టోర్లు తెరావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో యాపిల్ కోసం నిబంధనలు మార్చాలి. అందుకు కేంద్రం సుముఖంగా లేదు. పైగా స్థానికులకే ఉద్యోగాలు అన్న నిబంధనను కూడా మార్చాల్సి ఉంటుంది. అది ఖచ్ఛితంగా వివాదస్పదం అవుతుంది. అందుకే ఈ తలనొప్పులు అంతా ఎందుకనుకున్న కేంద్రం సింపుల్ గా యాపిల్ పెట్టుకున్న దరఖాస్తును పక్కనపడేసిందని బ్లూమ్ బర్గ్ కథనం సారాంశం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Apple  refurbished iPhones  apple stores in india  tim cook  India  make in india  

Other Articles