రాజకీయ వ్యభిచారం పిచ్చలైట్ అంటున్నాడు | deve gowda shocking comments on sting operation

Deve gowda shocking comments on sting operation

Deve Gowda, former PM, karnataka, rajyasabha bazaar, Deve Gowda shocking comments, latest news, కర్ణాటక, రాజ్యసభ బజార్, దేవగౌడ, మాజీ ప్రధాని, దేవగౌడ స్టింగ్ ఆపరేషన్, తాజా వార్తలు, కర్ణాటక రాజకీయాలు, తెలుగు వార్తలు, జాతీయ వార్తలు, రాజకీయాలు, telugu news

former PM Deve Gowda backs to his MLAs who caught in sting operation. admits politicians involve corruption common.

ITEMVIDEOS: రాజకీయ వ్యభిచారం పిచ్చలైట్ అంటున్నాడు

Posted: 06/04/2016 12:40 PM IST
Deve gowda shocking comments on sting operation

కర్ణాటకలో ‘రాజ్యసభ బజార్’ రాజకీయ దుమారం రేపి 24 గంటలు కూడా గడవలేదు. పెద్దల సభ సీటు కోసం ఎమ్మెల్యేలకు 5 నుంచి 10 కోట్లు ఎరవేయటం, ఓ ఎమ్మెల్యే చానెల్ గాలానికి చిక్కి స్టింగ్ ఆపరేషన్ లో ఆ వ్యవహారం అంతా బయటపడటం తెలిసిందే. ఈ వ్యవహారపై ఎన్నికల కమిషన్ తోసహా పలువురు నేతలు షాక్ కి గురయ్యారు. ముక్త కంఠంతో ఆ భాగోతాన్ని ఖండించారు. అయితే గుంపులో గొవింద ఎందుకనుకున్నాడో ఏమో మాజీ ప్రధాని, జేడీ సెక్యులర్ చీఫ్ దేవ గౌడ మాత్రం భిన్నంగా స్పందించారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంకా దుమారం రేపుతున్నాయి.

ప్రస్తుత రాజకీయాలపై స్పందించాల్సిందిగా కోరిన మీడియాకు ఆయన షాకిచ్చే సమాధానాలిచ్చారు. ఇప్పటి రాజకీయాలను ప్రక్షాళన చేయాలనుకోవటం మూర్ఖత్వమే అవుతుందంటూ పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో అవినీతి కామన్ గా మారిపోయింది. ఎమ్మెల్యేలకూ అవసరాలు ఉంటాయి! వచ్చే ఎన్నికల్లో ఖర్చుపెట్టుకోవడానికి కావాలి కదా. అయినా చిన్నపార్టీలను పెద్ద పార్టీలు టార్గెల్ చేయటం చాలా చిన్న విషయం, తప్పేం కాదంటూ వ్యాఖ్యానించాడు. రాజకీయ కుట్రలో భాగంగానే తన ఎమ్మెల్యేను ఇరిక్కించారంటూ ఇంకోవైపు దొరికిన ఎమ్మెల్యేలను వెనకేసుకొచ్చారు. అయితే మీడియాను పిచ్చోళ్లను చేసేందుకే తమ ఎమ్మెల్యే కావాలనే స్టింగ్‌లో పాల్గొన్నాడని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి చెబుతుండటం విశేషం. ఇంకోవైపు మాజీ పీఎం రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చేవారికి రూ.10 కోట్లు ఇచ్చేలా బేరం జరిగిందని బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, వేలకోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసి, విదేశాలకు పోరిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మద్దతుగా  మాట్లాడి దేవగౌడ విమర్శలు ఎదుర్కున్నాడు కూడా.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deve Gowda  former PM  rajyasabha bazaar  Deve Gowda shocking comments  

Other Articles