పాస్ వర్డ్ లేదని అని వైఫై వాడారో... | fathwa issued against wifi thefts in saudi arabia

Fathwa issued against wifi thefts in saudi arabia

free wifi, fatwa, Saudi arabia, సౌదీ అరేబియా, ఫ్రీ వైఫై, ఫత్వా, తాజా వార్తలు, తెలుగు వార్తలు, latest news, telugu news

A Saudi scholar issued a fatwa against using another person's WiFi without permission, since theft cannot be tolerated in Islam. When the WiFi service is open such as in parks, malls, cafeterias, hotels and government departments, then there is no problem since it is meant to be used by the people or clients.”

పాస్ వర్డ్ లేదు కదా అని వైఫై వాడారో...

Posted: 06/04/2016 08:55 AM IST
Fathwa issued against wifi thefts in saudi arabia

ప్రస్తుతం వైఫై జమానా నడుస్తోంది. ఇంటర్నెట్ లేకుండా యువత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. ఎక్కడికెళ్లినా ముందు వైఫై ఆన్ చేసుకుని ఇంటర్నెట్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవటం పరిపాటి అయిపోయింది. పొరపాటున ఒకవేళ కనెక్ట్ అయ్యిందా పండగ చేసేస్కుంటున్నారు. ఇక షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ లు కూడా ఫ్రీ వైఫై తో ఉదరగొడుతు కస్టమర్లను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. గంటలు గంటలు అందులో గడపాల్సి వచ్చే వారు దాంతో టైంపాస్ చేసేసుకుంటున్నారు. ఇంతవరకు అయితే ఫర్వాలేదు కానీ, పొరుగింట్లో లేక ఆఫీసు సముదాయాల్లో పాస్ వర్డ్ లేకున్నా వాడేసుకోవటం లాంటివి చేసేస్తుంటాం. ఇకపై ఆటలు చెల్లవంటూ దుబాయ్ చట్టాలు చెబుతున్నాయి..

వైఫైను వినియోగదారుడికి తెలీకుండా వాడుకోవటం దొంగతనంతో సమానమంటూ సౌదీ అరేబియాలో ఏకంగా ఒక ఫత్వా జారీ చేసేశారు. సౌదీ రాజుకు మతపరమైన అంశాల్లో సలహాలిచ్చే సంఘంలోని సీనియర్ స్కాలర్ అలీ అల్ హకామీ ఈ ఫత్వాను రూపొందించించినట్లు సమాచారం. ఇకపై అంతర్జాలపు కనెక్షన్ ఉన్న వినియోగదారుడి అనుమతి లేకుండా వేరే వ్యక్తులు వినియోగించుకుంటే అక్కడ దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అయితే పార్కులు, షాపింగ్ మాల్స్, కెఫెటేరియాలు, హోటళ్లు, ప్రభుత్వ శాఖలను మాత్రం ఇందులోంచి మినహాయింపు ఇచ్చారు. అంతేకానీ, ప్రొవైడర్ అనుమతి లేకుండా వినియోగించుకోవాలని చూస్తే మాత్రం శిక్షిస్తారని ఓ గల్ఫ్ న్యూస్ ఛానెల్ కథనం ప్రసారం చేసింది .

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : free wifi  fatwa  Saudi arabia  

Other Articles