స్టింగ్ ఆపరేషన్ లో చిక్కిన కక్కుర్తి ఎమ్మెల్యేలు | karnataka MLAs caught in sting operation for RS polls

Karnataka mlas caught in sting operation for rs polls

Karnataka MLAs, sting operation, rajyasabha polls, కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు, స్టింగ్ ఆపరేషన్, చిక్కిన ఎమ్మెల్యేలు, కన్నడ వార్తలు, తాజా వార్తలు, తెలుగు వార్తలు, latest news, politics, political news, national news, telugu news

A GROUP of MLAs from Karnataka were being shown by a television news channel on Thursday, purportedly demanding money, in crores of rupees, for supporting a candidate in the upcoming Rajya Sabha elections. India Today TV showed footage from a sting operation in which four MLAs or their relatives had either demanded money or discussed the possibility of accepting money for supporting a particular candidate in the elections for the Upper House.

స్టింగ్ ఆపరేషన్ లో చిక్కిన కక్కుర్తి ఎమ్మెల్యేలు

Posted: 06/03/2016 10:20 AM IST
Karnataka mlas caught in sting operation for rs polls

కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ టీవీ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఎమ్మెల్యేలు చిక్కారు. ఓవైపు ఏకగ్రీవంగా, ఎలాంటి పోటీ లేకుండా పెద్దల సభకు ఎన్నికలు జరుగుతుంటే అక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. నిర్ణీత స్థానాల కంటే ఎక్కువ మంది ఇక్కడ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో  పోలింగ్ తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో ఆయా అభ్యర్థులు గెలపు కోసం  అడ్డదారులు తొక్కుతున్నారు. విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ఎంతమేర ముడుపులు చెల్లించేందుకైనా వెనుకాడటం లేదు. ఇదే అదనుగా ఎమ్మెల్యేలు కూడా తమ ఓటుకు ఆకాశాన్నంటే ధరను ప్రకటిస్తున్నారు. దీనికి ఆయా ఎమ్మెల్యేలు కూడా సై అంటున్నారు.  ‘‘రూ.5 కోట్లిస్తామంటే చెప్పండి, మా ఓటు మీకే’’ అంటూ ఎమ్మెల్యేలు ఆయా పార్టీల తరఫున బరిలోకి దిగిన రాజ్యసభ అభ్యర్థులకు తేల్చిచెబుతున్నారు.

ఈ క్రమంలో ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కు నలుగురు ఎమ్మెల్యేలు అడ్డంగా బుక్కయ్యారు. రూ.5 కోట్లిస్తే పార్టీలతో సంబంధం లేకుండా ఓటేయడానికి తాము సిద్ధమేనంటూ స్టింగ్ కెమెరాకు చిక్కిన ఆ ఎమ్మెల్యేల్లో... ఇద్దరు జేడీఎస్ కు చెందిన వారు కాగా, కేజీపీకి చెందిన మరో ఎమ్మెల్యే, స్వతంత్ర శాసనసభ్యుడు ఉన్నారు. ఈ స్టింగ్ వీడియో ప్రస్తుతం కన్నడనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా ఏకంగా ఆ రాష్ట్రంలో  జరిగే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆలోచిస్తుంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka MLAs  sting operation  rajyasabha poll  telugu news  

Other Articles