మధురలో ఎస్పీ సహా 14 మందిని చంపారు | including SP 14 died in mathura clash

Including sp 14 died in mathura clash

mathura clash, SP died, Netaji Subhash Chandra Bose followers, మధురలో హింస, నేతాజీ అనుచరులు, ఎస్పీ ముకుల్ ద్వివేదీ, అఖిలేష్ యాదవ్, latest news, telugu news, uttara pradesh

A superintendent of police (SP), a constable and 12 protesters were killed and over 40 people injured in a violent clash between police and encroachers, who claim to be ‘true followers of Netaji Subhash Chandra Bose’, during a drive to evict illegal occupants of a land in Mathura district. Daljeet Singh, ADG (Law and Order) claimed that attackers have been identified and arrests will be made soon.

మధురలో ఎస్పీ సహా 14 మందిని చంపారు

Posted: 06/03/2016 09:44 AM IST
Including sp 14 died in mathura clash

రాష్ట్రపతి, ప్రధాని ఎన్నికలతో సహా అన్నింటినీ రద్దు చేయాలి, రూపాయి నోటు మీద నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటో ముంద్రించడంతోపాటు రూపాయి అనే పేరుని అజాద్ హిందూ ఫౌజ్ గా మార్చాలి. ఒక్క రూపాయికే 40 లీటర్ల పెట్రోల్, 60 లీటర్ల డీజీల్ సరఫరా చేయాలి. ఇందులో ఏ ఒక్కటి అమలు కాదని వారికీ తెలుసు. కానీ, వాటి వంకతో అల్లర్లకు దిగారు, హింసను సృష్టించారు. వెరసి ఓ ఎస్పీతోసహా 14 మందిని పొట్టనబెట్టుకున్నారు. యూపీ లోని మధురలో గురువారం అర్థరాత్రి చెలరేగిన హింసలో ఈ దారుణం చోటుచేసుకుంది.

నేతాజీకి ‘నిజమైన అనుచరులు’గా చెప్పుకుంటున్న రెండు వేలకు పైగా మంది ఒక్కసారిగా దాడికి తెగపడ్డారు.  ఎస్పీ, మరో కానిస్టేబుల్ తో పాటు మరో 12 మంది ఈ దాడిలో మృత్యువాత పడ్డారు. ‘ఆజాద్ భారత్ విధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ అనే సంస్థ కార్యకర్తలు జవహార్ బాగ్ లోని ఓ మైదానంలో ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని సభను నిర్వహించుకుంటున్నారు. అంతేకాదు చుట్టుపక్కల స్థానికులు భూములను ఆక్రమించుకుని నివసిస్తున్నారు. ఈ భూ దురాక్రమణలను తొలగించాలని ఇటీవలె అలహాబాదు హైకోర్టు తీర్పు వారికి మొట్టికాయలు వేసింది. దీంతో కోర్టు ఆర్డర్ కాపీని పట్టుకుని రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులకు నేతాజీ అనుచరులు, స్థానికులు షాకిచ్చారు. పక్కా ఖాళీ చేయాల్సి రావటంతో ఇలా ఆచరణ సాధ్యంకానీ డిమాండ్లను లేవనెత్తారు. ఆవంకతో ఒక్కసారిగా అధికారులు,  పోలీసులపై  దాడికి దిగారు. వేలాదిగా తరలివచ్చిన స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు తేరుకునేలోగానే నష్టం జరిగిపోయింది. దాడిలో మధుర సిటీ ఎస్పీ ముకుల్ ద్వివేదీతో పాటు నగరంలోని ఫరా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ సంతోష్ కుమార్, మరో 12 మంది చనిపోయారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో సగం మంది పోలీసులే ఉండటం గమనార్హం. స్థానికుల మూకుమ్మడి దాడితో కాస్తంత ఆలస్యంగా తేరుకున్న పోలీసులు ఆ తర్వాత పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం మధురలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అందులో నిజమైన నేతాజీ అనుచరులు ఎవరూ లేరని, రెండేళ్ల క్రితం బాబా జై గురుదేవ్ వర్గం ఈ దాడికి పాల్పడిందని కొందరు చెబుతున్నారు. కాగా, ఘటన సీఎం అఖిలేష్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయటంతోపాటు అగ్రా మెజిస్ట్రేట్ తో విచారణకు ఆదేశించాడు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mathura clash  SP died  Netaji Subhash Chandra Bose followers  telugu news  

Other Articles

Today on Telugu Wishesh