అడల్ట్ సైట్లో పాపులర్ టీవీషో | HBO sues Pornsite over Game of Thrones clips

Hbo sues pornsite over game of thrones clips

HBO, Game of Thrones, pornhub, హెచ్ బీవో, పోర్న్ సైట్, గేమ్ ఆఫ్ థోర్న్స్, పోర్న్ హబ్, తాజా వార్తలు, entertainment, latest news, telugu news

The makers of Game of Thrones are taking action against Pornhub over breach of copyright. HBO says it's because some scenes from the show have appeared on the site. Some other videos even include parodies of porn stars pretending to be characters such as Cersei Lannister and Lord Varys from Game of Thrones. In a statement, HBO said: "HBO is aware of the issue and is in the process of getting material taken down from Pornhub."

అడల్ట్ సైట్లో పాపులర్ టీవీషో

Posted: 06/02/2016 03:34 PM IST
Hbo sues pornsite over game of thrones clips

గేమ్ ఆఫ్ థోర్న్స్ ఓ ఆంగ్ల టెలివిజన్ సిరీస్. డేవిడ్ బెనియోఫ్, వెస్సి రూపొందించిన ఫాంటసీ డ్రామా శృంగారం, నగ్నత్వం, హింస ప్రధానాంశాలుగా ప్రముఖ చానెల్ హెచ్ బీవోలో ప్రసారమవుతోంది. ఇప్పటికే ఆరు భాగాలు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ప్రస్తుతం ఏడోది అందించేందుకు సిద్ధంగా ఉంది. వీడియో గేమ్ గా కూడా ఇది చాలా పాపులర్ అయ్యింది. అయితే ఇందులోని దృశ్యాలను తమను సంప్రదించకుండా ఓ పోర్న్ సైట్ వాడుకుంటుందంటూ సదరు చానెల్ న్యాయపోరాటానికి దిగింది.

ఈ పాపులర్ షో లోని అడల్ట్ దృశ్యాలను పోర్న్‌హబ్‌ అనే ప్రముఖ పోర్న్ వెబ్‌సైట్‌ వాడుకుంటుంది. కాపీరైట్‌ నిబంధనలను ఉల్లంఘించి శృంగార దృశ్యాలను పోర్న్‌హబ్‌లో పెట్టిన విషయం తమ దృష్టికి వచ్చిందని, వీటిని తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని హెచ్‌బీవో ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, తమ సైట్లో అత్యధిక వీక్షకులు గేమ్ ఆఫ్ థ్రోర్న్స్ కు చెందిన వీడియోలనే ఎక్కువగా చూస్తున్నారంటూ తాజాగా పోర్న్ హబ్ ఓ నివేదిక వెల్లడించింది. దీంతో హెచ్ బీవో ఇలా చర్యలకు దిగింది.  అంతేకాకుండా ఈ షోలోని లార్డ్ వరిస్‌, సెర్సీ, డెనెరిస్‌ తార్గరిన్‌ పాత్రల పేర్లతో కూడా కొన్ని సెక్స్ దృశ్యాలు కూడా అందులో ఉన్నాయంట. వాటిని కూడా వెంటనే తొలగించాలని చానెల్ పట్టుపడుతోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HBO  Game of Thrones  pornhub  copyright  telugu news  

Other Articles