నాసాలో కాకినాడ అమ్మాయి రచ్చ | deepika davuluri won in NASA rover challenge 2016

Deepika davuluri won in nasa rover challenge 2016

kakinada girl, deepika davuluri, NASA rover challenge 2016, కాకినాడ దీపికా దవులూరి, దీపికా దవులూరి, నాసా చాలెంజ్, రోవర్ తయారీ, NASA news, international news, telugu news, latest news

kakinada girl deepika davuluri won in NASA rover challenge 2016.

నాసాలో కాకినాడ అమ్మాయి రచ్చ

Posted: 06/01/2016 01:17 PM IST
Deepika davuluri won in nasa rover challenge 2016

అమెరికా అంతరిక్ష పరిశోధన నాసా తాజాగా ఓ పోటీని నిర్వహించింది. చంద్రమండలం పై రాళ్లు, ఇసుక సేకరించేందుకు ప్రస్తుతం మానవరహిత రోవర్లను వాడుతున్నారు. భవిష్యత్తులో మానవులే నేరుగా వెళ్లి నమునాలు సేకరించేలా రోవర్ లు తయారు చేయాలన్నదే నాసా ఆలోచన. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఓ పోటీ నిర్వహించి విద్యార్ధులందరికీ పిలుపునిచ్చింది. దీనిని కాకినాడకు చెందిన దీపికా దవులూరి చాలెంజ్ గా తీసుకుంది. ఆమె ప్రస్తుతం చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదువులో ఆమె ప్రతిభను గుర్తించిన యూనివర్సిటీ టీం లీడ్ గా దీపికనే నియమించింది. రోవర్ తయారీ కోసం జర్మనీలోని లైఫ్ బిగ్ లో ఉన్న స్పేస్ ఎడ్యుకేషన్ సెంటర్ లో 20 రోజులపాటు తన టీంతో శిక్షణ తీసుకుంది.

ఈ ఏడాది జనవరిలో చెన్నైలోని టెక్ మంత్రా ల్యాబ్ లో నాసా మాక్ టెస్ట్ నిర్వహించగా అందులో దీపికా టీం ఎంపికయ్యింది. దీంతో అమెరికాలోని అలబామాలో జరిగే పోటీలకు అర్హత సాధించినట్లయ్యింది. ఏప్రిల్ చివర్లో జరిగిన ఫైనల్ పోటీకి దాదాపు 90 దేశాలకు చెందిన వందల మంది పోటీపడగా, దీపిక జయకేతనం ఎగరవేసింది. రోవర్ తయారీలో ఉత్తమ అంతర్జాతీయ జట్టుగా తన టీంను నిలబెట్టింది. ఆమె తయారు చేసిన రోవర్ చాలా ప్రత్యేకమైందని నాసా కితాబిచ్చింది. అత్యంత వేడిని సైతం తట్టుకోగలిగే శక్తి దానికుందని ప్రకటించింది. ప్రయోగ సమయంలో తాను ఎంతో ఉద్వేగానికి గురయ్యాయని, అయితే దీనిని ఓ పోటీ లాగా కాకుండా ప్రయోగంలా చూడమని రాస్ హెకెల్ చెప్పటం తనకు చాలా సహకరించిందని దీపిక వివరించింది. భవిష్యత్తులో కెమికల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీయలిస్ట్ గా ఎదగాలన్నదే తన కోరిక అని ఆమె చెబుతోంది. ఏ రంగంలోనైనా భారతీయులు తమ సత్తా చాట గలరని దీపిక ఈ విజయం ద్వారా మరోసారి రుజువు చేసింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kakinada girl  deepika davuluri  NASA rover challenge 2016  

Other Articles