వైఎస్ ను ఏసేసినట్లు జగన్ ను చంపేస్తాడంట | Bhumana sensational comments on chandra babu

Bhumana sensational comments on chandra babu

Bhumana Karunakar Reddy, chandra babu, rajashekar reddy, jagan, భూమాన కరుణాకరణ్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజేశేఖర్ రెడ్డి, జగన్, తాజా వార్తలు, రాజకీయాలు, ఏపీ వార్తలు, ap news, latest news, politics

Bhumana sensational comments on chandra babu. babu killed YS rajashekar. now eyed on jagan.

ITEMVIDEOS: వైఎస్ ను చంపినట్లే జగన్ ను ఏసేస్తాడంట!

Posted: 05/30/2016 02:48 PM IST
Bhumana sensational comments on chandra babu

వైసీపీ కీలక నేత భూమన కరుణాకర రెడ్డి కాసేపటి క్రితం సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాదులోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. మహానాడులో చంద్రబాబు పచ్చి బూతులు మాట్లాడారని మండిపడ్డారు. కుల రాజకీయాలు, కుల పిచ్చితో చంద్రబాబు పైకి వచ్చారని, దానిని ఎస్వీయులో  విద్యార్థులకు కూడా వ్యాపింప జేశారని ఆరోపించారు. చంద్రబాబులా అబద్దాలు చెప్పే దుర్మార్గుడు ఈ భూమ్మీద ఎవరూ లేరన్నారు. అవసరమైతే ఎవరి కాళ్లైనా పట్టుకునే అమీబా జాతి వ్యక్తి అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

మూడు రోజులు తిరుపతి జగన్ నామస్మరణతో మారుమోగిపోయింది. జగన్ ని తిట్టడమే లక్ష్యంగా మహానాడు నిర్వహించినట్లుంది. దీనిని బట్టి జగన్ ఓ ప్రతిపక్ష నాయకుడిగా విజయవంతం అయ్యాడని చెప్పుకోవచ్చన్నారు.  భవిష్యత్తులో వైసీపీ ఉండదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చూస్తుంటే అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందేమోననిపిస్తోంది. అంతేకాదు ఇప్పుడు వైఎస్ జగన్ నిర్మూలించేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు మొదలవుతున్నాయని ఆరోపించారు. అంతేందుకు వంగవీటి రంగా హత్యకు కారకుడైన ఆయన(చంద్రబాబు) హత్యా రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని. ఈ విషయాన్ని సీనియర్ నేత హరిరామజోగయ్య తన పుస్తకంలో కూడా రాశారని చెబుతున్నారు. లోకేష్ బాబును సూటుకేసు బాబుగా వర్ణిస్తూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు కార్యాలయం, ఇంట్లో సీసీ కెమెరాలు పెడితే ఆయన చేసే బాగోతాలు బయటపడుతుందన్నారు. తిరుపతి వేదికగా మూడు రోజుల పాటు జరిగిన మహానాడును టార్గెట్ చేసి భూమాన ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhumana Karunakar Reddy  chandra babu  rajashekar reddy  jagan  

Other Articles