ఫిర్యాదు చేద్దామని వస్తే పాపం ఏం చేశారో చూడండి | muzaffarnagar police polishing their shoes with complainant

Muzaffarnagar police polishing their shoes with complainant

Muzaffarnagar cops, shine their shoes, complainant, ముజఫర్ నగర్ పోలీసుల, షూ పాలిస్, ఫిర్యాదుదారుడు, జాతీయ వార్తలు, ఉత్తరప్రదేశ్ వార్తలు, తాజా వార్తలు, latest news, national news

Muzaffarnagar cops to shine their shoes in order to get his complaint filed.

ITEMVIDEOS: ఫిర్యాదు చేద్దామని వస్తే పాపం ఏం చేశారో చూడండి

Posted: 05/30/2016 10:58 AM IST
Muzaffarnagar police polishing their shoes with complainant

మరో అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. శరణు వేడి వచ్చిన వారిని రక్షించాల్సిన పోలీసులే ఇక్కడ వారి పట్ల వ్యవహరించిన తీరు మరీ దారుణం. ఫిర్యాదు చేయడానికి వస్తే వారు ఏం చేశారో తెలిస్తే ఎవరికైనా ఒళ్లు మండిపోవటం ఖాయం. ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఉదంతపు వీడియో ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్.

వివరాళ్లోకి వెళితే... తనకు వచ్చిన సమస్యను పోలీసులకు చెప్పుకొని, ఫిర్యాదు చేసేందుకు ఓ పెద్దాయన ముజఫర్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఫిర్యాదు తీసుకోకపోగా, ఆయన్ని ఎండలో బయటే చాలా సేపు కూర్చోబెట్టారు. ఆపై వారంతా బయటకి వచ్చి అక్కడున్న బల్లలు మీద కూర్చుని పిచ్చపాటిగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ముగ్గురు పోలీసు అధికారులు తాపీగా తమ బూట్లు విప్పి పాలిష్ చేయమని ఆ వృద్ధుడికి హుకుం జారీ చేశారు. చేసేది లేక ఆయన వాటిని పాలిష్ చేయసాగాడు. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి షూట్ చేసి మీడియాకు అందజేశాడు. దీంతో వారి వ్యవహరం అంతా బయటపడింది. ఈ విషయం తమ దృష్టిలోకి వచ్చిందని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసకుంటామని ముజఫర్ నగర్ ఎస్పీ సంతోష్ కుమార్ తెలిపారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muzaffarnagar cops  shine their shoes  complainant  

Other Articles