16-year-old raped by 33 men in Brazil, video shared on social media

Brazil faces its nirbhaya crisis 16 year old raped by 33 men in rio

Brazil, Brazilian mass rape, rape video on social media, mass rape photos on social media, rio mass rape posted online, rio mass rape graphic video, gang rape, gang-raped, rio-de-janeiro mass rape, rio-de-janeiro gang rape, 16 Year Old Raped By 33 Men In Rio, gang rape in rio, girl raped by 33 men in rio, brazil girl raped by 33 men, 33 men gangrape rio girl

Brazilian police search for at least 30 suspects in alleged gang rape of a 16-year-old girl, posting graphic video and images of her on social media.

ITEMVIDEOS: పదహారేళ్ల బాలికపై 33 మృగాళ్ల గ్యాంగ్ రేప్

Posted: 05/28/2016 11:43 AM IST
Brazil faces its nirbhaya crisis 16 year old raped by 33 men in rio

సరిగ్గా రెండు నెలలు తరువాత పక్షం రోజుల పాటు అత్యంత ఘనంగా ఒలంపిక్స్ పోటీలను నిర్వహించి తమ ప్రతిష్టను మరింతగా మెరుగుపర్చుకోవాలని, అందుకు ఏర్పాట్లలో తనమునకలైన బ్రెజిల్ ప్రభుత్వం ప్రయత్నాలకు అ దేశ యువకులు అప్రదిష్టను మూటగట్టేలా చేశారు. సరిగ్గా ఆగస్టు 5 నుంచి ఒలంపిక్స్కు ఆతిధ్యమివ్వనున్న బ్రెజిల్ నగరం రియో డి జెనీరోలో అత్యంత దారుణ ఘటనకు అక్కడి యువతపాల్పడ్డారు. చిత్తకార్తి వీధి కుక్కలు కూడా చేయనంత దారుణంగా ఓ పదహారేళ్ల మైనర్ బాలికపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను మించేలా తలపిస్తున్న ఈ ఘటనలో ఓ 16 ఏళ్ల బాలికకు బలవంతంగా మత్తు పదార్థాలు ఇచ్చి.. ఆ తరువాత అమెపై 33 మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బ్రెజిల్ మహిళా సంఘాలు, సమాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. దారుణానికి పాల్పడిన వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. రియోలోని ఫవేలా ప్రాంతానికి చెందిన ఓ బాలిక తన 20 ఏళ్ల బాయ్ఫ్రెండ్ వినతి మేరకు కలువడానికి వెస్టర్న్ ఫ్రింజ్లోని అతని గదికి వెళ్లింది. అయితే అలా వచ్చిన తన గర్ల్ ఫ్రెండ్ కు మత్తు పదార్థాలను ఇచ్చిన బాయ్ఫ్రెండే ఆమె పాలిట కాలయముడిలా మారాడు. ఆ తరువాత వారు డ్రగ్స్ తీసుకుని ఆ బాలికను 36 గంటల పాటు నిర్భందించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో గతవారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని, ఆ మరుసటి రోజు పక్క భవంతిలో తాను నగ్నంగా పడిఉన్నానని, చుట్టూ కొందరు తుపాకులు పట్టుకుని ఉన్నారని పోలీసులకు చెప్పింది. నీరసించిపోయిన బాధితురాలు మగవాళ్ల దుస్తులు ధరించి ఇంటికి తిరిగివచ్చిందని, ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల తర్వాత బాధితురాలు నగ్నంగా, అపస్మారక స్థితిలో ఉన్నప్పటి వీడియో ట్విట్టర్లో కనిపించింది. 40 సెకెన్ల నిడివిగల వీడియోను ఓ నిందితుడు పోస్ట్ చేశాడు. మరో నిందితుడు బాధితురాలితో అభ్యంతరకర పరిస్థితిలో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

ఈ దృశ్యాలను నెటిజెన్లు షేర్ చేసుకున్నారు. ట్విట్టర్ యాజమాన్యం ఈ ఫొటోలను తొలగించే లోపే 500 లైక్లు వచ్చాయి. ఈ దారుణ ఘటనపై బ్రెజిల్లో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. మహిళలపై దాడులు, అత్యాచార సంస్కృతి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఆన్లైన్లో హింసాత్మక చర్యల పోస్టింగ్స్ పెట్టడాన్ని నిరసించారు. దీంతో బ్రెజిల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాధితురాలిని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించిన పోలీసులు, కేసును దర్యాప్తు చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brazil  Brazilian mass rape  rio de janriro gang rape  social media  posted online  

Other Articles