Sonia Gandhi 'Unifying Factor' In Congress says Union Minister Venkaiah Naidu

Sonia gandhi unifying factor for congress says venkaiah naidu

venkaiah naidu, bjp, assam elections, Sonia Gandhi, Congress, Rahul Gandhi, jd(u), nitish kumar, narendra modi, unifing factor, union minister venkaiah naidu,

Amid continued speculation about Rahul Gandhi's elevation as Congress president, Union Minister M Venkaiah Naidu said Sonia Gandhi was the "unifying factor" without whom the party would have "disintegrated"

సోనియా గాంధీపై కేంద్రమంత్రి ప్రశంసల జల్లు

Posted: 05/22/2016 06:26 PM IST
Sonia gandhi unifying factor for congress says venkaiah naidu

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరని బలంగా నమ్మె పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీ ఏకపక్ష మెజరిటీని సాధించి కేంద్రంలో అధికారంలో వుండగా, విపక్ష పార్టీలను ఎప్పటికప్పుడు ముప్పు తిప్పలు పెడుతుండగా, ఆ పార్టీ కేంద్రమంత్రి మాత్రం విపక్ష పార్టీకి చెందిన అధినేత్రి సోనియాగాంధీపై మాత్రం ప్రశంసల జల్లు కురిపించారు. ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీని నిత్యం దునుమాడే బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తాజాగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ప్రశంసించారు.

కాంగ్రెస్‌ పార్టీని ఐక్యంగా ఉంచే శక్తి సోనియా మాత్రమేనని, ఆమె లేకపోతే ఏనాడో ఆ పార్టీ విచ్ఛిన్నమయ్యేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీని నియమించే విషయమై జరుగుతున్న చర్చపై ప్రశ్నించగా ఆయన ఈ మేరకు స్పందించారు. 'నాయకత్వం అనేది వారి అంతర్గత వ్యవహారం. సోనియాగాంధీ వల్లే కాంగ్రెస్‌ పార్టీ ఐక్యంగా ఉందని నేను చెప్పగలను. ఆమె లేకపోతే పార్టీ విచ్ఛిన్నమయ్యేది. వంశపారంపర్య రాజకీయాలను నేను ఆమోదించనప్పటికీ ఇది నా అభిప్రాయం' అని ఆయన పేర్కొన్నారు.

'వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యంలో పనికిమాలినవి అయినా కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నేతలు, మద్దతుదారులకు మాత్రం అవే ప్రీతిపాత్రంగా కనిపిస్తాయి. కానీ, నిజాన్ని మాత్రం ఒప్పుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీ ఐక్యత కారకం సోనియానే' అని ఆయన పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అయితే, నాయకురాలిగా ఆమె నాయకత్వం విజయవంతం కాలేదని తాజా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉటంకిస్తూ పేర్కొన్నారు. విదేశీ మహిళ ప్రధాని కారాదని కొరివిపెట్టి అమెకు ప్రధాని పదవి దక్కకుండా చేసిన బీజేపి.. ఈ మాత్రం అయిన అమెను ప్రశంసించిందంటే విడ్డూరంగానే వుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonia Gandhi  Venkaiah Naidu  Congress  Rahul Gandhi  BJP  

Other Articles