జయహో జయలలిత | May Jayalalitha get victory in Tamilnadu elections

May jayalalitha get victory in tamilnadu elections

Tamilnadu, Jayalalitha, Anna DMK, AIDMK, Jayalalitha in Tamilnadu, Amma in Tamilnadu, తమిళనాడు, జయలలిత, ఎలక్షన్స్

Tamilnadu CM Jayalalitha may get one more time power in this elections. Jaya.lalitha mostly win this eelctions.

జయహో జయలలిత

Posted: 05/19/2016 10:49 AM IST
May jayalalitha get victory in tamilnadu elections

తమిలనాట కొత్త అధ్యాయానికి తమిళ ప్రజలు తెర తీసేసినట్లున్నారు. ప్రతిసారి అధికార పీఠాన్ని చేతులు మార్చే తమిళ ఓటర్లు ఈసారి రెండో సారి అమ్మచేతికి అవకాశాన్ని ఇచ్చే సూచలను క్లీయర్ గా కనిపిస్తున్నాయి.  జయలలిత నేతృత్వంలోని అధికార అన్నాడీఎంకే పార్టీకే మరోసారి పట్టంకట్టి రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాయనున్నట్లు ఓట్ల లెక్కింపు తేలుస్తోంది. 234 స్థానాలకు గాను 130 స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 118 స్థానాల్లో గెలుపు ఖాయం చేసుకుంటే తమిళ సింహాసనం మరో ఐదేళ్ళు అమ్మ స్వంతమైనట్టే.

తమిళనాడు ఓటరు నాడిపై నాలుగు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా వీటిలో మూడు సంస్థల అంచనాలు తప్పని ఈ గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. ఒక్క టైమ్స్ నౌ - సీ ఓటర్ మినహా న్యూస్ నేషన్, న్యూస్ ఎక్స్, యాక్సిస్ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు జయ ఓటమి ఖాయమని తేలిపోయింది. కౌంటింగ్ ప్రారంభమైన సుమారు గంటన్నర సమయం వరకూ అన్నాడిఎంకే - డీఎంకే మధ్య నువ్వా - నేనా అన్నట్టు పోటీ కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా సీట్ల మధ్య వ్యత్యాసం పెరుగుతూ వచ్చింది. తమ పార్టీదే మళ్ళీ అధికారమని ఖాయం చేసుకున్న ఏడీఎంకే కార్యకర్తలు చెన్నైలోని జయ నివాసానికి చేరుకుంటున్నారు. మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. తమిళనాడులో జయ అభిమానుల కోలాహలం మిన్నంటింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles