kannada actress | maithriya gowda | sentenced | 2 years' imprisonment

Maithriya sentenced to 2 years imprisonment

bangalore local court, kannada actress, sentenced, small-time actress Maithriya Gowda, two years’ imprisonment, one-year imprisonment, younger sister Supriya Gowda, Roopa, Rekha, actress assault head constable,

A local court sentenced small-time actress Maithriya Gowda to two years’ imprisonment and awarded one-year imprisonment to her younger sister Supriya Gowda and her relatives Roopa and Rekha for assaulting a head constable on duty about five years ago.

కన్నడ నటిపై నేరం రుజువు.. రెండేళ్ల జైలు శిక్ష..

Posted: 05/14/2016 11:03 AM IST
Maithriya sentenced to 2 years imprisonment

కన్నడ నటి కటకటాల పాలైంది. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో కన్నడ నటి మైత్రేయిగౌడకు రెండేళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ నగర మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెల్లడించింది. మైత్రేయగౌడ స్నేహితులు ముగ్గురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 2011లో నటి మైత్రేయిగౌడ, అమె స్నేహితురాళ్లు సుప్రియ, రూపా, రేఖతో కలిసి నగరంలో ఓ వైపు కారు డ్రైవింగ్ చేస్తూ మరో వైపు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోంది. బసవేశ్వర ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్  శివకుమార్ కారును అడ్డుకోగా మైత్రేయిగౌడ ఆమె స్నేహితులు హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనపై బసవేశ్వరనగర ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గత ఐదేళ్లుగా కేసును విచారించిన బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు నలుగురి నేరానికి పాల్పడ్డారని సాక్షాధారాలను పరిశీలించి తుది తీర్పును వెల్లడించింది. కన్నడ నటి మైత్రేయ గౌడకు రెండేళ్ల జైలు శిక్ష, అమె స్నేహితులకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. అయితే తమకు శిక్ష ఖరారవుతుందన్న విషయం ముందగానే తెలుసుకున్న అమె తరపు న్యాయవాదులు ఆ వెంటనే నగర 5 వ ఏసీఎంఎం కోర్టును ఆశ్రయించారు. తాము నేరం చేయలేదని తమకు బెయిలు మంజూరు చేయాలని కోరారు. దీంతో బెంగళూరు ఐదో ఏసీఎంఎం కోర్టు ఈ నలుగురికీ బెయిల్ మంజూరైంది.  

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Traffic Head Constable  Kannada actress maitreyigauda  Sentenced to prison  

Other Articles