రాజ్యసభ ఎన్నికలు | Elections for Rajya Sabha on June 11

Elections for rajya sabha on june 11

Rajya sabha, parliament, Rajya sabha members, Telangana, Ap, రాజ్యసభ, పార్లమెంట్

Biennial elections to 57 Rajya Sabha seats, including the one vacated by liquor baron Vijay Mallya, will be held on June 11, the Election Commission said on Thursday.

రాజ్యసభ ఎన్నికలు

Posted: 05/13/2016 07:58 AM IST
Elections for rajya sabha on june 11

పార్లమెంట్ లో పెద్దల సభకు మొత్తానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు, ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. ఈ నెల 24వ తేదీన పదిహేను రాష్ట్రాలలోని 57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజున సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు, ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. తెలంగాణ నుంచి వీ హనుమంత రావు (కాంగ్రెస్), గుండు సుధారాణి (టిడిపి –టీఆర్ ఎస్ )ల టర్మ్ పూర్తి కానుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సుజనా చౌదరి (టిడిపి, కేంద్రమంత్రి), జేడీ శీలం (కాంగ్రెస్), జైరామ్ రమేష్ (కాంగ్రెస్), నిర్మలా సీతారామన్ (బీజేపీ, కేంద్రమంత్రి)ల టర్మ్ పూర్తి కానుంది.

కర్నాటక నుంచి రాజ్యసభకు వెళ్లిన, తెలుగు రాష్ట్రాలకు చెందిన నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు టర్మ్ కూడా పూర్తి కానుంది. విహెచ్, గుండు సుధారాణి, సుజనా, జేడీ శీలం, జైరామ్ రమేష్, నిర్మలా సీతారామన్, వెంకయ్య నాయుడులతో పాటు విజయ్ మాల్యా, అంబికా సోనీ తదితరుల 57 మంది టర్మ్ పూర్తి కానుంది. ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల ద్వారా బీజేపీకి 5 రాజ్యసభ స్థానాలు పెరిగే అవకాశముంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో రాజ్యసభ టికెట్లు ఆశిస్తున్నవారెందరో ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ, తెలంగాణలలో ఎవరెవరికి అవకాశాలు దక్కనున్నాయనే చర్చ సాగుతోంది. తెలంగాణలో రెండు టీఆర్ ఎస్ -కు, ఏపీలో మూడు టిడిపి - బిజెపి మిత్రపక్షానికి, ఒకటి వైసిపికి దక్కే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ -లో మిత్రపక్షంలో భాగంగా రెండు టిడిపికి, ఒకటి బిజెపికి వెళ్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles