Hope PM Modi Will Now Stop Toppling Governments: Arvind Kejriwal

Uttarakhand result setback to modi government says arvind kejriwal

Arvind Kejriwal,Uttarakhand assembly,Prime Minister Narendra Modi address,Uttarakhand Floor Test

Delhi Chief Minister Arvind Kejriwal today took a dig at Prime Minister Narendra Modi after the floor test in the Uttarakhand assembly hinted at a victory for the ruling Congress.

‘‘ఇది ప్రధాని మోడీకి గట్టి ఎదురుదెబ్బ..’’

Posted: 05/10/2016 06:03 PM IST
Uttarakhand result setback to modi government says arvind kejriwal

అవకాశం దొరికినప్పుడల్లా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు గుప్పించే ఢిల్లీ ముఖ్యమంత్రి, అప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఉత్తరాఖండ్ పరిణామాలను అదనుగా చేసుకుని ప్రధానిపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో కాంగ్రెస్ గెలవడం నరేంద్ర మోదీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు అయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విమర్శలను గుప్పించారు.

అంతేకాదండోయ్ ఇక నుంచైనా నరేంద్రమోడీ, బిజేపి పార్టీ.. ప్రభుత్వాలను కూల్చడం మానుకోవాలని హితవు పలికారు. ప్రధాని మోదీ ఇకనైనా ప్రభుత్వాలను కూల్చచడం మానుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ శాసనసభలో విశ్వాసపరీక్ష ముగిసిన తర్వాత కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. బలపరీక్షలో తమదే విజయమని కాంగ్రెస్ దీమా వ్యక్తం చేసింది. ఫలితాన్ని సుప్రీంకోర్టు రేపు అధికారికంగా ప్రకటించనుంది

కాగా నరేంద్రమోడీ విద్యార్హతల విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పట్టే ప్రయత్నం కూడా చేశారాయన. ఏకంగా కేంద్ర సమాచార శాఖ కమీషనర్ కు లేఖ రాసిన కేజ్రీవాల్, ప్రధాని విద్యార్హతల విషయంలో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దేశ ప్రజలకు ప్రధాని విద్యార్హతలు తెలుసుకోవాలని వుందని, వాటిని ఎందుకు గోప్యంగా వుంచుతున్నారని కూడా ఆయన డిమాండ్ చేశారు, కాగా ఆయన సాధించిన విద్యార్హతలు బీజేపి బహిర్గతం చేసినా.. వాటిని నకిలీవని అరోపించి, తాము స్వయంగా వెళ్లి ప్రదాని డిగ్రీల విషయంలో స్పష్టతను తెలుసుకుంటామని కూడా ప్రకటించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles