బిజెపి, కాంగ్రెస్ పై కేజ్రీ ఫైర్ | Arvind Kejriwal fire on BJP and Congress

Arvind kejriwal fire on bjp and congress

BJP, Congress, Delhi, Modi, Congress, కాంగ్రెస్, బిజెపి, దిల్లీ, అరవింద్ కేజ్రీవాల్

Delhi CM Arvind Kejriwal fired on Congress party for Agusta west land alligations and BJP for Modi. He challenged BJP to submit police force to his hands.

బిజెపి, కాంగ్రెస్ పై కేజ్రీ ఫైర్

Posted: 05/07/2016 01:04 PM IST
Arvind kejriwal fire on bjp and congress

మోదీ జాతకం మొత్తం మీ దగ్గర ఉందని గుజరాత్ కాంగ్రెస్ నేతలు గతంలో అన్నారు...మీ చేతులో ఏముంది? దానిని వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. అగస్టా స్కాంపై నిజానిజాలు బయటిపెట్టాలని కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆప్ ఆద్మీ పార్టీ నాయకులు అందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.... కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయి పార్లమెంటును అడ్డుకుంటున్నాయని అన్నారు. రెండు పార్టీలు కలిసి కావాలని ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో కాంగ్రెస్ అగ్రనేతలు తప్పు చేశారని ఆరోపిస్తున్నప్పుడు దోషులపై సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదని ఆయన నిలదీశారు. తమకు నెల రోజుల పాటు పోలీసు యంత్రాగాన్ని అప్పగిస్తే...నిజానిజాలు వెలికి తీస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలీసు యంత్రాగంపై అధికారం కల్పించే ధైర్యం కేంద్రానికి ఉందా? అని ఆయన సవాల్ విసిరారు. మత్తానికి అరవింద్ కేజ్రీవాల్ అటు బిజెపిని, ఇటు కాంగ్రెస్ ను ఏకకాలంలో ఏకిపారేసి మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇందులో కేజ్రీవాల్ ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles